27.7 C
Hyderabad
May 4, 2024 10: 14 AM
Slider కృష్ణ

ఏపి ప్రభుత్వ ఉద్యోగుల నెత్తిన ‘టైమ్ బాంబ్’

#APsecretariat

ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకూ ఉద్యోగులు విధుల్లో ఉంటేనే జీతం చెల్లించేందుకు ఏపి ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. ఈ మేరకు తాజా ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్ని ఆదేశాలు ఇచ్చినా ఉద్యోగులు పాటించడం లేదని అందుకోసం తుది సారి హెచ్చరికలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది.

ఈ నెల 17వ తేదీ నుంచి ప్రతీ ఉద్యోగి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ విధి నిర్వహణలో ఉండాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతే కాకుండా ప్రతీనెలా 75 ప్రభుత్వశాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఇలా మొత్తం వారి మాన్యువల్, బయోమెట్రిక్ అటెండెన్సు సాధారణ పరిపాలనశాఖకు పంపించాలని పేర్కొంది.

ఇకపై ఉద్యోగులు విధినిర్వహణలో చేసిన విధులకు సంబంధించి మాత్రమే జీతభత్యాలు ఇచ్చేలా చర్యలు తీసుకోబుతున్నారనే వార్నింగ్ కూడా ఉత్తర్వులతో పేర్కొంది. ఇటీవలే ఐఏఎస్ అధికారులకు సైతం ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్సు అమలు చేసిన ప్రభుత్వం ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విధుల్లో ఉండాలనే ఉత్తర్వులు ఇపుడు ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లుపరిగెట్టిస్తున్నాయి.

Related posts

తెఫ్ట్ కంట్రోల్ :హైదరాబాద్‌లో చంబల్‌ గ్యాంగ్‌ అరెస్టు

Satyam NEWS

బాగ్ అంబ‌ర్ పేట్‌లో నూత‌న మ్యాన్ హోల్స్ నిర్మాణం

Sub Editor

వనపర్తిలో ఆసుపత్రి, ల్యాబులు తనిఖీ

Satyam NEWS

Leave a Comment