26.7 C
Hyderabad
May 3, 2024 09: 42 AM
Slider ముఖ్యంశాలు

జిల్లాల వారీగా ఖ‌నిజ వ‌న‌రులు, భూగ‌ర్భ వివ‌రాల‌తో మ్యాప్ లు

#gsi

75 ఏళ్ల స్వాతంత్య్ర సంస్మరణ సందర్భంగా నిర్వహిస్తోన్న స్వాతంత్య్ర అమృత్ మహోత్సవాల‌లో భాగంగా హైదరాబాద్ లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(GSI), ద‌క్షిణాది ప్రాంతీయ ప్రధాన కార్యాలయం శుక్రవారం వారోత్సవ వేడుక‌లు ప్రారంభించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా గనుల మంత్రిత్వ శాఖ 2022 జూలై 11 నుండి 17 వరకు మహా వారోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మొద‌లైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా GSI అదనపు డైరెక్టర్ జనరల్ జనార్ధన్ ప్రసాద్ హాజరై మాట్లాడుతూ సమర యోధుల త్యాగాలు, పోరాటం కారణంగానే నేడు మ‌నం స్వాతంత్య్ర అమృతోత్సవాలు నిర్వహించుకుంటున్నాం అన్నారు.

ఈ సందర్భంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిల్లాల వారీగా రూపొందించిన డిస్ట్రిక్ట్ రిసోర్స్ మ్యాప్ (DRM)లను ఆయన విడుదల చేశారు. ఆయా జిల్లాల వారీగా నిర్దిష్ట భూగర్భ నిల్వల వివ‌రాలు, ఖనిజ వనరులను అవి వివరిస్తాయి. అలానే భౌగోళిక శాస్త్రాన్ని వర్ణించే ఇన్‌సెట్ మ్యాప్‌లు, జియోహైడ్రాలజీ, జియోటెక్నికల్ లక్షణాలతో ఆరు జిల్లాల వనరుల వివరాలతో తెలంగాణ రాష్ట్ర పటాలను(Map) విడుదల చేశారు. ఇందులో హైదరాబాద్, పెద్దపల్లి, వనపర్తి, మెదక్, నాగర్ కర్నూల్ మరియు కామారెడ్డి జిల్లాలు వున్నాయి. ఈ పటాలు ప్రొఫెషనల్ మరియు విద్యార్థులకు మాత్రమే కాకుండా ప్రభుత్వ విభాగాలకు ప్రయోజనకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణా, పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం జియోలాజికల్ ప్రదర్శన మరియు ప్రయోగశాలల సంద‌ర్శ‌న‌,  GSI విజయాలపై చర్చ కార్య‌క్ర‌మం, GSI  కార్యకలాపాలను ప్రదర్శించడంతోపాటు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంపై క్విజ్ పోటీలు త‌దిత‌ర కార్యక్రమాలు నిర్వ‌హించారు.

కార్య‌క్ర‌మంలో  అదనపు డైరెక్టర్ జనరల్ జనార్ధన్ ప్రసాద్ మాట్లాడుతూ 2022-23 సంవత్సరంలో GSI సదరన్ రీజియన్ 184 ప్రాజెక్టులను అమలు చేస్తోందని తెలిపారు.  ప్రధానంగా ఫీల్డ్ సర్వేలు, బేస్‌లైన్ జియోసైన్స్ డేటా ఉత్పత్తి, ఖనిజ అన్వేషణ (మినరల్ ఎక్స్‌ప్లోరేషన్), జియోఇన్ఫర్మేటిక్స్ మరియు పబ్లిక్ గుడ్ జియోసైన్సెస్‌ను కలిగి ఉండటం తో పాటు, మొత్తం 4925 చ.కి.మీ జియోలాజికల్ మ్యాపింగ్, 65,056 చ.కి.మీ జియోకెమికల్ మ్యాపింగ్, 28,800 చ.కి.మీ జియోఫిజికల్ మ్యాపింగ్ మరియు 62 ఖనిజ పరిశోధన (మినరల్ ఇన్వెస్టిగేషన్) ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

GSI, సదరన్ రీజియన్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఖనిజ అన్వేషణ నివేదికలను అందజేయడం ద్వారా కేంద్రప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో తనవంతు పాత్రను చురుకుగా నిర్వహిస్తోంద‌న్నారు. GSI ముఖ్యమైన నివేదికలు, ప్రత్యేక ప్రచురణలు, నేపథ్య పటాలు అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇటీవలి దక్షిణ భారతదేశం యొక్క భూగర్భ శాస్త్రం మరియు ఖనిజ వనరులు, సౌత్ ఇండియా ఎకనామిక్ జియాలజీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక జిల్లా వనరుల పటాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, కర్నాటక మరియు కేరళ యొక్క భూగర్భ శాస్త్రం మరియు ఖనిజ వనరుల రాష్ట్ర పటాలు వంటి నేపథ్య పటాలు ఉన్నాయి. ఇవన్నీ GSI పోర్టల్‌లో పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్నాయి (https://www.gsi.gov.in). జియోసైన్స్ కు సంబంధించిన కార్యకలాపాలలో భాగంగా తెలంగాణలోని నాగర్‌కర్నూల్ మరియు నల్గొండ జిల్లాల్లో ఫ్లోరైడ్ కాలుష్యం, తీవ్ర కిడ్నీ వ్యాధి (chronic kidney disease), ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో మరియు రాయచూర్ జిల్లా,కర్ణాటకలో ఉపరి/ఉపరితల నీటిలో ఆర్సెనిక్ మరియు ఫ్లోరైడ్ కలుషితాలకు కారణమైన భూగర్భ అధ్యయనాలు కొనసాగుతున్నాయి అని తెలిపారు.

Related posts

బేషరతుగా కలిసి పని చేస్తున్న జనసేన బిజెపి

Satyam NEWS

అనాథ పిల్లలకు స్వెటర్స్ పంచిన అనురాగ్ హెల్పింగ్ సొసైటీ

Satyam NEWS

స్మిమ్మింగ్ పోటీలను ప్రారంభించిన విజయనగరం డిప్యూటీ మేయ‌ర్

Satyam NEWS

Leave a Comment