32.2 C
Hyderabad
May 9, 2024 11: 13 AM
Slider జాతీయం

చెత్త రాజకీయాలను చీపురుతో ఊడ్చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ

#Aravind Kejriwal

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన అనూహ్య విజయం జాతీయ స్థాయి రాజకీయాల వైపు ఆ పార్టీ దృష్టి కేంద్రీకరించేందుకు మార్గం సుగమం చేసింది. 2017 ఎన్నికలలో కేవలం 20 సీట్లలో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ 2022 నాటికి తన బలాన్ని ఏకంగా 92 స్థానాలకు పెంచుకుంది. పంజాబ్ రాష్ట్రంలో నాన్ కాంగ్రెస్, నాన్ అకాలీదళ్ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం దక్కించుకోవడం పలువురి దృష్టిని ఆకర్షించింది.

ఇక మునిగిపోతున్న నౌకలా మారిన కాంగ్రెస్ కు జాతీయ స్థాయి ప్రత్యామ్నాయ పార్టీగా అవతరించడం ఖాయమని రాజకీయ పరిశీకుల భావన. వరుస ఓటముల తో కాంగ్రెస్ క్రమంగా దేశ ప్రజలకు దూరమవుతున్న నేపథ్యంలో ఏర్పడిన రాజకీయ శూన్యత భర్తీ చేయడానికి ఇప్పుడున్న పార్టీలలో దేనికి అవకాశం ఉందనే విషయంలో ఏకాభిప్రాయం లేదు.

జాతీయ పార్టీగా ఎదిగే సత్తా ఉన్న పార్టీ ఆమ్ ఆద్మీ

అయితే…భారతీయ జనతా పార్టీకి ధీటుగా జాతీయ స్థాయి రాజకీయాలు నెరపగల సత్తా, ప్రజామోదం పొందగల సిద్ధాంతం, ప్రజాస్వామిక దృక్కోణం, విశాల ప్రజాహిత ఆకాంక్ష ఆమ్ ఆద్మీ పార్టీకి పుష్కలంగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

ఢిల్లీ మోడల్ తరహాలో ప్రజలు విశ్వసించేలా తమ పార్టీ ఏ స్థాయిలో ఐనా రాణించగలదని ఆ పార్టీ బలంగా చెబుతోంది. అయితే కేవలం తొమ్మిదేళ్ళ వయసున్న పార్టీ దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలనుకోవడం అత్యాశ అని భాజపా, కాంగ్రెస్ తో సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. అయితే..ఒకటి మాత్రం నిజం. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కో రాష్ట్రంలో తన ఉనికిని విస్తృతం చేస్తోంది.

ఇప్పటికే యూపీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, చండీఘర్, ఒరిస్సా, తమిళ్ నాడు, పంజాబ్, గుజరాత్, ఝార్ఖండ్, అస్సాం,బీహార్ వంటి రాష్ట్రాలలో ఆప్ కు క్రియాశీల కార్యకర్తలతో కూడిన శాఖలు ఉన్నాయి. ఈ బలంతోనే 2021లో జరిగిన యూపీ పంచాయతీ ఎన్నికలలో 80 సీట్లు, మహారాష్ట్ర పంచాయితీ ఎన్నికలలో 70 స్థానాలు, చండీగఢ్ మున్సిపల్ ఎన్నికలలో 14 వార్డులు, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 27 సీట్లు కైవసం చేసుకుంది.

క్రమంగా పెరుగుతున్న ఆమ్ ఆద్మీ

దేశం మొత్తం మీద ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలలో భాజపాకు 1339, కాంగ్రెస్ కు 762 , ఆప్ కు 156 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది జరుగనున్న హిమాచల్ ప్రదేశ్,గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ భాజపా తో సహా అన్ని పార్టీలకు గట్టి పోటీ ఇవ్వడానికి కార్యాచరణ రచిస్తోంది. అరవింద్ కేజ్రివాల్ మోడల్ ఆఫ్ గవర్నేస్ ను ఇకపై పోటీచేసే ప్రతి ఎన్నికలలో ఉదహరించనుంది.

నిజాయతీ, అవినీతిరహిత పాలన, కనీస మౌలిక సదుపాయాల కల్పన,యువతకు ఉద్యోగ అవకాశాలు, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన ప్రాతనిధ్యం వంటి అనేక పాజిటివ్ అంశాలతో… ఒకవైపు అధికార భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, మరోవైపు కాంగ్రెస్ కు అసలైన ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదగాలంటే చాలా అంశాలలో ఆ పార్టీ స్పష్టంగా తనను తాను నిర్వచించుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

వాస్తవం కాకపోయినా… భాజపా పై హిందుత్వ పార్టీ అనే ముద్ర ఉందని, కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచీ సెక్యులర్ పార్టీగా ప్రజల నమ్మిక అని.. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా జాతీయ స్థాయి రాజకీయాలలో తన స్టాండ్ ఏమిటనేది ప్రజలకు సూటిగా, నిర్మొహమాటంగా చెప్పాలని వారు సలహా ఇస్తున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల నాటికి భారతదేశ రాజకీయాలలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుం టాయో వేచి చూడాలి. ఏమైనా బహుళ పార్టీల ప్రభావం వల్ల ఓటర్లుగా  భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు గానీ సగటు భారతీయ ఓటరుకు మాత్రం ప్రజాస్వామ్య పరిరక్షణే అంతిమ లక్ష్యం.

పొలమరశెట్టి కృష్ణారావు, రాజకీయ విశ్లేషకులు

Related posts

చక్రస్నానంతో ముగిసిన శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర ‌స్వామివారి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

కరోనా కరోనా: వలస బతుకులకు తప్పని తిప్పలు

Satyam NEWS

ఎమోషనల్ మూమెంట్: మోడీ మీరే మా పాలిట దేవుడు

Satyam NEWS

Leave a Comment