24.2 C
Hyderabad
July 20, 2024 18: 01 PM
ఆంధ్రప్రదేశ్

తహసీల్దార్‌ హసీనాబీకి ఆశ్రయం ఇస్తే కేసులో ఇరుకుతారు

haseena

గూడూరు తహసీల్దార్‌ హసీనాబీ ఏసీబీ కేసులో ముద్దాయిగా ఉన్నారని, ఆమెకు ఎవరైనా ఆశ్రయం ఇస్తే వారిపై కేసు నమోదు చేస్తామని ఏసీబీ డీఎస్పీ నాగభూషణం హెచ్చరించారు. తన వ్యక్తిగత సహాయకుని ద్వారా లంచం తీసుకున్న గూడూరు తహసీల్దార్‌ హసీనాబీ ఇంకా పరారీలో ఉన్నారని ఆయన తెలిపారు. ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఆమె కోసం పలు బృందాలు గాలిస్తున్నాయి. ఆమె గురించి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ కోరారు. అలాగే తహసీల్దార్‌ హసీనాబీ సూచనల మేరకు లంచం తీసుకున్న మహబూబ్‌బాషాను శనివారం కోర్టులో హాజరు పరిచారు.

కోర్టు ఆయనకు ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్‌ విధించినట్లు డీఎస్పీ తెలిపారు.

Related posts

అవినీతికి ఉద్వాసన ఇలా సాధ్యమా?

Satyam NEWS

అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Satyam NEWS

జర్నలిస్టులకు ఎక్రెడిటేషన్ల జీవోపై హైకోర్టు నోటీసులు

Satyam NEWS

Leave a Comment