ఈఎస్ఐ మందుల కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెంనాయుడు కు ఉచ్చు బిగుసుకుంటున్నది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ, విజిలెన్స్ విభాగం, అవినీతి నిరోధక శాఖ పలు దఫాలుగా వివిధ ప్రాంతాలలో దాడులు చేసి మందుల కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు సేకరించారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఒకే వ్యక్తి 42 కంపెనీల పేర్లతో మందులు, పరికరాల సరఫరా చేసే విషయమై ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో ఈఎస్‌ఐ ఆస్పత్రులకు మందులు చేరకుండానే బిల్లులు పెట్టిన వైనం వెలుగు చూసింది. చంద్రబాబు హయాంలో ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల ఒక్క సంవత్సరంలోనే రూ. 300 కోట్ల మేర గోల్‌మాల్ జరిగినట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ లో విచారణ ప్రాధమిక దశలోనే ఉండగానే తెలంగాణలో ఈఎస్ఐ కుంభకోణంపై అరెస్టులు కూడా సాగుతున్నాయి. తెలంగాణ విచారణ అధికారులు ఇప్పటికే కీలకమైన వ్యక్తుల్ని అరెస్టు చేశారు. అయితే ఇంకా పెద్ద తలకాయలు బయటకు రావాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ప్రాధమిక దర్యాప్తులోనే అప్పటి మంత్రికి ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు ప్రాధమిక సాక్ష్యాధారాలు లభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పొద్దున లేస్తూనే తెలంగాణ ను తిట్టిపోసే చంద్రబాబునాయుడు, ఆయన మంత్రులు ఈఎస్ఐ కుంభకోణం చేయడానికి మాత్రం తెలంగాణ తో కలిసి పని చేశారు. తెలంగాణ ఈఎస్ఐ కి మందులు సరఫరా చేసిన కంపెనీ పెద్దలే ఆంధ్రప్రదేశ్ లో కూడా మందులు సరఫరా చేశారు. దీనికి కీలక పాత్రధారిగా అచ్చెంనాయుడి పేషీ అధికారులు ఉన్నట్లు ప్రాధమిక సాక్ష్యాధారాలు లభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మంత్రి అచ్చెంనాయుడే కాకుండా టీడీపీ లోని మరి కొందరు ముఖ్యనేతలపై కూడా ఈ కుంభకోణానికి సంబంధించి ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నట్లు చెబుతున్నారు. టీడీపీ నేతలతో కుమ్మక్కైన సరఫరా కంపెనీల సిండికేట్ అధిక ధరలకు మందులు, కిట్లను సరఫరా చేసిన వైనం గురించి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తెలంగాణలో స్కామ్ చేసిన సంస్థలకే ఏపీలో పెద్ద పీట వేశారు. తమ నేరం బయటపడుతుందనే భయంతో విచారణ అధికారులను సైతం ప్రలోభపెట్టేందుకు సిండికేట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దీంతో ఈ స్కాంపై మంత్రి జయరాములు విచారణకు ఆదేశించిన క్రమంలో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు
previous post
next post