29.7 C
Hyderabad
May 3, 2024 03: 28 AM
Slider తెలంగాణ

వాషింగ్టన్ డీసీ లో టీడీఎఫ్ సమావేశం ముగింపు

t dev foram

అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లో జరుగుతున్న telangana development forum ( టీడీఫ్ ) 20 సంవత్సరాల వేడుకల్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బిజినెస్ సమ్మిట్ లో మాట్లాడారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఇరిగేషన్, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో దేశంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న తెలంగాణలో అంతర్జాతీయంగా అనేక వ్యాపారాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. పౌల్ట్రీ రంగం లాగానే షీప్ ఫార్మ్ ల  వ్యాపారానికి తెలంగాణ ఎంతో అనుకులమైన వాతావరణమని వినోద్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతం వాతావరణ సమశితోష్ణ స్థితి కలిగిఉందని, ప్రతి రంగానికి ఎంతో అనువైనదని అన్నారు. తెలంగాణలో అనేక ఇన్నోవేషన్ కార్యక్రమాలు అమలవుతున్నాయని ఆయన అన్నారు.  టీ హబ్, అనేక ఇన్నోవేటివ్ కార్యక్రమాలు, ఐటీ, ఫార్మా పరిశ్రమలు తెలంగాణలో ఆవిష్కారం అయ్యాయని వినోద్ కుమార్ తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ను బంగారు తెలంగాణాగా మార్చేందుకు సీఎం కేసీఆర్ నిరంతరంగా కృషి చేస్తున్నారని  బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. టీడీఎఫ్ 20 ఏళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి,  డాక్టర్ దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

హ్యాండ్లూమ్ బోర్డును వెంటనే పునరుద్ధరించాలి

Satyam NEWS

కడప జిల్లాలో భారీగా ఎర్రచందనం డంప్ స్వాధీనం…

Satyam NEWS

ప్రొటెస్ట్: తుళ్లూరు రోడ్లపై వంటా వార్పు

Satyam NEWS

Leave a Comment