38.2 C
Hyderabad
April 29, 2024 19: 19 PM
Slider ప్రత్యేకం

A Tale of the City పుస్తకాన్ని ఆవిష్కరించిన మామిడి హరికృష్ణ

#bookrelease

ప్రముఖ కవి, రచయిత కె.హరనాథ్ రచించిన ఏ టేల్ ఆఫ్ ద సిటి (A Tale of the City) ఆంగ్ల పుస్తకాన్ని తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ నేడు ఆవిష్కరించారు. కె.హరనాథ్ తెలుగు లో రచించిన ‘నగరంలో నగ్న సత్యాలు’ దీర్ఘ కవితను ‘ఏ టేల్ ఆఫ్ ద సిటీగా’ ప్రముఖ రచయిత చింతపట్ల సుదర్శన్ ఇంగ్లీష్ లోకి అనువదించారు.

రవీంద్రభారతి ప్రాంగణంలోని తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. గుడ్ షేపర్డ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బ్రదర్ కురియాచన్ కు కె.హరనాథ్ ఈ పుస్తకాన్నిఅంకితమిచ్చారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ ఇలాంటివి ఎన్నో తెలుగు పుస్తకాలను ఆంగ్లంలోకి అనువదిస్తే చదవటానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

హైదరాబాద్ నగరాన్ని ప్రేమించడానికి ఎన్నో అంశాలు ఉన్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరంలోని ప్రతి అంశం మనలో ప్రేమ భావనలను ప్రేరేపిస్తుందని ఆయన అన్నారు. ఉదాహరణకు సిటీకాలేజీ ఆడిటోరియాన్ని చూస్తే అద్భుత కళానైపుణ్యం ఉట్టిపడుతుందని హరికృష్ణ వివరించారు. ఇలాంటి ఉదాహరణకు చారిత్రాత్మక హైదరాబాద్ నగరంలో కొన్ని లక్షల ప్రదేశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

ఉత్తర భారతానికి, దక్షిణ భారతానికి కేంద్ర బిందువుగా ఉన్న హైదరాబాద్ దేశంలోని దాదాపు అన్ని భాషలవారిని, అన్ని సంస్కృతుల వారిని అక్కున చేర్చుకున్నదని మామిడి హరికృష్ణ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని భాషల వారి సంస్కృతులను గౌరవిస్తూ వారి పండుగలను కూడా అధికారికంగా నిర్వహిస్తున్నదని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సత్యం న్యూస్. నెట్ చీఫ్ ఎడిటర్ సత్యమూర్తి, ప్రముఖ కవయిత్రి మంజుల సూర్య, వర్ధమాన రచయిత వేముల నారాయణ, కె.వినయ్ కుమార్ లు కూడా పాల్గొన్నారు. లాల్ దర్వాజలోని హైదరాబాద్ పాత నగర కవుల వేదిక ఈ పుస్తకాన్ని ప్రచురించింది.

Related posts

ఈసీఐఎల్ సంస్థ ప్రభుత్వ పాఠశాలలకు చేయూతనివ్వాలి

Satyam NEWS

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓయూ లో మాక్ అసెంబ్లీ

Satyam NEWS

ఉన్న పెన్షన్లు కూడా కట్ చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment