35.2 C
Hyderabad
May 11, 2024 17: 54 PM
Slider మహబూబ్ నగర్

వాల్మీకి దేవాలయ శిలామండప నిర్మాణనికి భారీ విరాళం

#valmikitemple

రామాయణ మహా కావ్యాన్ని రచించిన మహర్షి వాల్మీకి దేవాలయ శిలా మండప నిర్మాణానికి శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ వ్యవస్థాపక వంశీయులు కృష్ణమాన్య పట్వారి ప్రహ్లాద రావు, పద్మావతమ్మ దంపతులు రూ.1,00,000 ల విరాళం గద్వాల జిల్లా మల్దకల్ మండల వాల్మీకి పూజారులకు ఆదివారం అందజేశారు. దేవాలయ కార్యాలయంలో వాల్మీకి పూజారులు కుండికాళ్ల సమక్షంలో ఈ విరాళాన్ని అందజేశారు.

గత పది సంవత్సరాల క్రితం మల్దకల్ లో వాల్మీకి విగ్రహ ప్రతిష్ట చేయగా చిన్న గర్భగుడి నిర్మించారు. ఆ దేవాలయాల్ని శిలామండప దేవాలయముగా మలిచేందుకు వాల్మీకి పూజారులు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రహ్లాద రావు మాట్లాడుతూ వాల్మీకి కులస్తులకు ఆరాధ్య దైవమైన మహర్షి వాల్మీకి విగ్రహాన్ని దేవాలయ స్థలమైన సర్వేనెంబర్ 339లో గతంలో నెలకొల్పడం జరిగిందని, శిలా మండప నిర్మాణం చేస్తే శాశ్వతంగా ఉంటుందని తాను తనవంతుగా విరాళం అందజేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి పూజారులు, కొండికాళ్ళు, ఎమ్మిగనూరు రామకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.

Related posts

2000 నోటుతో లాభ సాటి వ్యాపారం

Satyam NEWS

అమరావతి  పునర్నిర్మాణం పై చంద్రబాబు నిర్ణయానికి బహుజన ఐకాస మద్దతు

Satyam NEWS

వనపర్తి జిల్లా రెడ్ క్రాస్ కు నాలుగు బంగారు పతకాలు

Satyam NEWS

Leave a Comment