36.2 C
Hyderabad
May 10, 2024 18: 40 PM
Slider ఖమ్మం

రహదారుల ద్వారా సమగ్రభివృద్ధికి చర్యలు

#Transport Minister Puvwada

రహదారుల విస్తరణ, అభివృద్ధికి ప్రాధాన్యత నిచ్చి, సమగ్రాభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రూ. 700 లక్షల అంచనా వ్యయంతో ఖమ్మం-ఇల్లందు రోడ్డు కి.మీ. 6/9-8/2 వరకు నాలుగు లైన్లుగా అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ పనులకు రఘునాథపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో రఘునాథపాలెం మండలం అర్బన్ మండలం కింద ఉండేదని, ఆ గ్రామంలో అడుగు పెడితే బురదగా ఉండేదని అన్నారు.

తాను పట్టుపట్టి, అర్బన్ మండలంగా ఉన్న రఘునాథపాలెం ను క్రొత్త మండలంగా ఏర్పాటు చేసామన్నారు. గత 9 ఏళ్లలో ఈ మండలం పై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు ఆయన అన్నారు. రఘునాథపాలెం మండలంలో రోడ్ల కోసం నిధులు తీసుకొని వచ్చినట్లు ఆయన తెలిపారు. తనకు వచ్చిన నిధులల్లో సింహభాగం రఘునాథపాలెం మండలంకే కేటాయించినట్లు మంత్రి అన్నారు. మండలంలో ఉన్న అనేక గ్రామాల్లో సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, డ్రెనేజీలు నిర్మాణం చేసామన్నారు.

మండలంలో అనేక గ్రామాల్లో డొంక రోడ్ల కోసం రూ. 2 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఇటీవలే మళ్ళీ రూ.2.30 కోట్లు మంజూరు అయ్యాయని ఆయన అన్నారు. రూ.13.60 కోట్లతో తండాలకు కనెక్టివిటీ కోసం అరు రోడ్లు మంజూరు చేశామన్నారు. గిరిజనులకు రాజ్యాధికారం కట్టబెట్టేందుకు అనేక మండలంలో అనేక తాండలను గ్రామ పంచాయతీ లుగా ఏర్పాటు చేసామన్నారు.

కొత్త మండలం ఐనా సరే అభివృద్ధిలో ముందు ఉండాలని తహాసీల్దార్, పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి, నూతన భవనాలు నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు ఈ రోడ్డు విస్తరణతో రఘునాథపాలెం ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. మండల అభివృద్ధితో రైతులు కోటిశ్వరులు అయ్యారని మంత్రి తెలిపారు.

కార్పొరేషన్ ఉన్న హంగులు అన్ని రఘునాథపాలెం మండలంలో ఉండే విధంగా పనులు చేసినట్లు ఆయన అన్నారు. రైతు రుణాలు మాఫీ చేసినట్లు, రైతులకు రూ. 75 వేల కోట్ల రైతుబంధు ఇచ్చి పెట్టుబడి సహాయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని ఆయన తెలిపారు.

గృహలక్ష్మీ కింద పేదలకు ఇంటి స్థలం ఉంటే రూ.3 లక్షలు ఇస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, ఆర్ అండ్ బి ఎస్ఇ లక్ష్మణ్, పీఆర్ ఇఇ కెవికె. శ్రీనివాస్, రఘునాథపాలెం ఎంపిపి గౌరీ, జెడ్పిటిసి ప్రియాంక, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బలహీనుల కోసం పోరాడేదే సీపిఐ పార్టీ

Satyam NEWS

ఒంటిమిట్టలో ధ్వజావరోహాణం పూర్ణాహుతి పూర్తి

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కృష్ణకు ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment