27.7 C
Hyderabad
May 7, 2024 09: 45 AM
Slider వరంగల్

మంత్రి దయాకర్ రావును కలిసిన ఆదర్శ గ్రామ ప్రతినిధులు

#Nellutla village

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని, మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో 13 జాతీయ అవార్డులు తెలంగాణ రాష్ట్రం సాధించగా, అందులో 9 కి 8 విభాగాలలో తెలంగాణా గ్రామాలు ఉత్తమ ప్రతిభను కనబరిచాయి. సమృద్ధిగా మంచినీటి వసతి కలిగిన గ్రామంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాన్ని, జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామం దేశంలో నెంబర్ వన్ గా నిలిచింది.

దీంతో ఆ గ్రామ సర్పంచ్ చిట్ల స్వరూప రాణి భూపాల్ రెడ్డి, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యుడు కొమ్మ రాజుల నర్సింహులు ఎర్రబెల్లి యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు సురుగు సుధాకర్ గౌడ్ లతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను కలిశారు. పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం వడ్డే కొత్త పల్లి తోటలో బి అర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనం లో ఉండగా వచ్చి ప్రత్యేకంగా ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

అలాగే శాలువాతో సత్కరించారు. మంచి ప్రతిభను కనబరచి రాష్ట్రానికి, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చారని చెప్పారు. అవార్డులు వచ్చిన గ్రామాలకు ప్రోత్సాహకంగా నిధులు ప్రత్యేకంగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి తెలిపారు. సీఎం కెసిఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ల సహకారం, ఆశీస్సులతో తాము, గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని నెల్లుట్ల గ్రామ సర్పంచ్ చిట్ల స్వరూప రాణి భూపాల్ రెడ్డి తెలిపారు. తమకు అవార్డు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 17న ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న తర్వాత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని, సీఎం కెసీఆర్ ని కలుస్తామని ఆమె వివరించారు.

Related posts

జెఈఈ అడ్వాన్స్ డ్ 2012 పరీక్ష జులై 3న

Satyam NEWS

శబరిమల యాత్రకు టిఎస్ ఆర్టిసి ప్రత్యేక అద్దె బస్సులు

Satyam NEWS

మసీదు నిర్మాణానికి వేరే చోట 5 ఎకరాల చోటు

Satyam NEWS

Leave a Comment