38.2 C
Hyderabad
April 29, 2024 11: 24 AM
Slider నల్గొండ నెల్లూరు

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

#Rice Millers Association

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కార్యకర్తలు,నాయకులు కృషి చేయాలని హుజూర్ నగర్ నియోజకవర్గ కో- ఆర్డినేటర్ మండవ వెంకటేశ్వర్లు గౌడ్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం ముఖ్య నాయకుల సమావేశం హుజూర్ నగర్ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగింది.ఈ సందర్భంగా మండవ వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, పేదలకు సంక్షేమ పథకాలు అందించిందని, అభివృద్ధి అంటే తెలుగుదేశం అనే విధంగా పని చేసిందని అన్నారు.

రెండు రూపాయలకే కిలో బియ్యం అందించడం, పటేల్,పట్వారి వ్యవస్థను రద్దు చేయడం, జనత వస్త్రాలను అందించడం, తక్కువ ధరకే విద్యుత్ హార్స్ పవర్ అందించడం, పేదలకు పక్కా భవనాలు నిర్మించడం వంటి ప్రజా రంజకమైన పరిపాలన అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు.తెలంగాణ అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ కీలకపాత్ర పోషించిన విషయాన్ని ప్రజలు గుర్తించాలని అన్నారు.నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో హైదరాబాద్,సికింద్రాబాద్ మహా నగరాలకు ధీటుగా సైబరాబాద్ మహానగరాన్ని నిర్మించి తెలంగాణలో 60 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచి రావడానికి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధే, కారణమన్నారు.హుజూర్ నగర్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు

.
హుజుర్ నగర్ నియోజకవర్గ కో- ఆర్డినేటర్ గా నియమితులైన మండవ వెంకటేశ్వర్లు గౌడ్ ని నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు ఘనంగా పూలమాలలతో,శాలువాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు.మండవ వెంకటేశ్వర్లు గౌడ్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింతగా బలోపేతం కావాలని నాయకులు ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ పార్టీ కన్వీనర్ కొమ్మగాని వెంకటేశ్వర్లు గౌడ్,గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు కేసరి నాగయ్య ముదిరాజ్, మఠంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు మాలోత్ నాగు నాయక్,టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి, నేరేడుచర్ల మండల పార్టీ అధ్యక్షుడు ఇంజమూరి వెంకటయ్య,హుజూర్ నగర్ మండల పార్టీ అధ్యక్షుడు నేలపట్ల అంజయ్య గౌడ్,చింతలపాలెం మండల పార్టీ అధ్యక్షుడు తిరుమలగిరి గోవిందు, పాలకీడు మండల పార్టీ అధ్యక్షుడు పొదిల్లా అమరయ్య,ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మీసాల సైదులు,బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వహక

కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు గౌడ్,టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి గుండేటి సతీష్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్, తెలుగు యువత పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చల్లా వంశీ,ఎస్సీ సెల్ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కస్తాల కనక రత్నం,ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చింత వెంకటేశ్వర్లు,తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ మేకల రామారావు యాదవ్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ పంటా చిన్నకోటిరెడ్డి,తెలుగు యువత నాయకులు తురక గోపి, బ్రహ్మయ్య, నరసింహారావు, నాగరాజు,నాగవెల్లి జాను,రామానుజం తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి హుజూర్ నగర్

Related posts

అనంతపురం స్పందన కార్యక్రమంలో 81 పిటిషన్లు

Satyam NEWS

స‌ర్ధార్‌కు నివాళులు!

Sub Editor

ఎమ్మెల్యేని ఓడించి దేవరకద్రను కాపాడుకుందాం

Satyam NEWS

Leave a Comment