23.2 C
Hyderabad
May 8, 2024 01: 54 AM
Slider ప్రత్యేకం

మళ్ళీ బాదారు

again hike

వరుసగా పెట్రో ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై మోయలేని భారం వేస్తున్నది. గ్యాప్‌లేకుండా చమురు ధరలు పెంచుతూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నది. మార్చి 22న ప్రారంభమైన ధరల మోత కొనసాగుతూనే ఉన్నది. ఆదివారం పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున పెంచిన చమురు కంపెనీలు తాజాగా 40 పైసలు వడ్డించాయి. దీంతో గత 14 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు పెరుగడం ఇది పన్నెండోసారి.

మొత్తంగా లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.44, డీజిల్‌పై రూ.9.10 పెరిగింది. తాజా పెంపుతో న్యూఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.103.81, డీజిల్‌ రూ.95.07కు చేరింది. ముంబైలో పెట్రోల్‌పై 84 పైసలు పెరగడంతో రూ.118.83కు పెరగగా, డీజిల్‌పై 43 పైసలు అధికమవడంతో రూ.103.07కు చేరింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 45 పైసలు‌, డీజిల్‌పై 43 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో లీటరు పెట్రోల్‌ ధర రూ.117.68కి, డీజిల్‌ రూ.103.75కి చేరింది.

Related posts

వైకుంఠధామం నిర్మాణానికి భూమిపూజ

Satyam NEWS

అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శ ప్రజానాయకుడు ప్రకాశం

Satyam NEWS

మిద్దె కూలి మరణించిన సర్పంచ్ ఆమె మనుమడు

Satyam NEWS

Leave a Comment