37.2 C
Hyderabad
May 6, 2024 12: 59 PM
Slider ముఖ్యంశాలు

ఈనాడు డెక్కన్ క్రానికల్ లో ఆకలి కేకలు

#DeccanChronicle

ఈనాడు, డెక్కన్ క్రానికల్ పత్రికల్లో పని చేస్తూ జర్నలిజాన్ని తామే మోస్తున్నట్లు భావించిన జర్నలిస్టులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. కరోనా ఎఫెక్ట్ ప్రారంభం కాగానే ఈ సంస్థల్లో రిట్రెంచ్ మెంట్లు ప్రారంభం అయ్యాయి. డెక్కన్ క్రానికల్ సంస్థ నుంచి వెలువడే ఆంధ్రభూమి మూతపడింది.

డెక్కన్ క్రానికల్ లో అయితే ఎనిమిది నెలలుగా జీతాలు లేవు. ఈనాడు సంస్థ దాదాపు 400 మందిని రిట్రెంచ్ చేసింది. డెక్కన్ క్రానికల్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు మహాధర్నా నిర్వహించబోతున్నారు. అదే విధంగా ఈనాడు చైర్మన్ సి హెచ్ రామోజీరావు స్వస్తలమైన కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలోఈనెల 13 వ తేదీన ఈనాడు మాజీ ఉద్యోగులు బిక్షాటన చేయాలని నిర్ణయించారు.

ఈనెల 12 వ తేదీన హైదరాబాదులోని అన్ని పత్రికా కార్యాలయాల ముందు బిక్షాటన చేస్తారు. ఆ తరువాత 13 తేదీన చలో పెద పారు పూడి కార్యక్రమంలో పాల్గొంటారు. పెదపారుపూడి రామోజీ పుట్టి పెరిగిన గ్రామం. రామోజీరావు తమ సొంత గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం దత్తత తీసుకున్నారు.

Related posts

విశాఖ రేంజ్ పరిధిలో పది మంది సీఐలు బదిలీ…!

Bhavani

బీఆర్‌ఎస్‌ గెలుపుకై ప్రతి ఒక్కరు పని చేయాలి

Satyam NEWS

ప్రజాపోరాటాలతోనే రాజధాని అమరావతిపై తాత్కాలికంగా వెనక్కి తగ్గిన జగన్

Satyam NEWS

Leave a Comment