28.7 C
Hyderabad
April 26, 2024 09: 31 AM
Slider గుంటూరు

ప్రజాపోరాటాలతోనే రాజధాని అమరావతిపై తాత్కాలికంగా వెనక్కి తగ్గిన జగన్

#tdpnarasaraopet

ప్రజాపోరాటాల కారణంగానే అమరావతిని రాజధానిగా కొనసాగించేందుకు జగన్ రెడ్డి తాత్కాలికంగా మళ్లీ నిర్ణయించారని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డా౹౹చదలవాడ అరవిందబాబు అన్నారు. మూడు రాజధానుల నిర్ణయం పై ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారని ఆయన అన్నారు.

స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట సోమవారం టిడిపి నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ జై అమరావతి, జై చంద్రబాబు, జై చదలవాడ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డా౹౹చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ టీడీపీ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అప్పటిలో నూతనంగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా చేసి అభివృద్ధి చేశారని అన్నారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర రాజధానిగా ఉన్న అమరావతిని పట్టించుకోకుండా మూడు రాజధానుల పేర్లతో చిచ్చు పెట్టారని అన్నారు. రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగటంతో రాజధానికై ఉద్యమించారని అన్నారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని పేరుతో రైతులు చేస్తున్న ఉద్యమానికి టిడిపి అమరావతి ఉద్యమ జెఎసి  నాయకులు మద్ధతు పలికారని అన్నారు.705 రోజులు వీరోచితంగా ఉద్యమించటం వలన ప్రభుత్వం అమరావతి రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రకటించిందని అన్నారు.

ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్,మంత్రులు,శాసనసభ్యులు, వైసిపి నాయకులు కళ్ళు తెరిచి అమరావతి రాజధానిగా స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికావలసి వస్తుందని హెచ్చరించారు. జై అమరావతి ప్లే కార్డులు ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వేములపల్లి నరసయ్య,పట్టణ పార్టీ అధ్యక్షులు కడియాల రమేష్ చల్లా,రొంపిచర్ల మండల పార్టీ అధ్యక్షులు వెన్న బలకోటి రెడ్డి,రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము,రాష్ట్ర రైతు కార్యదర్శి కడియం కోటి సుబ్బారావు,పార్లమెంట్ లీగల్ సెల్ అధ్యక్షులు రవేళ్ళ లక్ష్మీ నారాయణ,పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయ్ శ్రీ,సంగం డైరీ మాజీ డైరెక్టర్ మక్కెన ఆంజనేయులు,పట్టణ మైనార్టీ అధ్యక్షులు బడే బాబు, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు శాఖమురి మారుతి, టీ ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు ముచ్చు వీరయ్య మరియు పలువురు టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

సోమశిల జియో సెల్ సేవలకు అనుమతి కోరిన మల్లు రవి

Satyam NEWS

ఆ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అక్కడేం చేసారంటే…?

Satyam NEWS

రాజంపేట లో వైసీపీ కి ఎదురు దెబ్బ….

Satyam NEWS

Leave a Comment