38.2 C
Hyderabad
May 2, 2024 21: 33 PM
Slider పశ్చిమగోదావరి

దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోనే వ్యవసాయ రుణాలు

#pedavegi

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి సొసైటీ ద్వారా దరఖాస్తు చేసుకున్న 10రోజులాలోపే రైతులకు వ్యవసాయ రుణాలు అందిస్తున్నామని పెదవేగి సొసైటీ చైర్‌పర్సన్ పెను మాక వెంకటసుబ్బారావు అన్నారు. సొసైటీ సర్వసభ్య సమావేశం చైర్‌పర్సన్ అధ్యక్షతన గురువారం మద్యాహ్నం జరిగింది.

ఈ సమావేశంలో చైర్‌పర్సన్ సుబ్బారావు మాట్లాడుతూ 2021 2022 ఆర్థిక సంవత్సరానికి గాను సొసైటి ద్వారా 400 నుండి 500 మంది రైతులకు రుణాలు అందించామని చెప్పారు. గతంలో ఇదే సొసైటీ లో రుణాలు పొందాలంటే రైతులకు సుమారు మూడు మాసాల సమయం పట్టేది అన్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో 800 మంది సభ్యులకు కొత్తగా సభ్యత్వం ఇచ్చామన్నారు.

వారికికూడా త్వరలో రుణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. సొసైటీలో ఉన్న రైతుల డిపాజిట్లకు అధిక వడ్డీ అందజేస్తామని చైర్‌పర్సన్ వివరించారు. సొసైటీ లాబాలబాటలో ఉందని చెప్పారు.సొసైటీ సిబ్బంది సేవలను చైర్పర్సన్ సుబ్బారావు ప్రశంసించారు. ఋణాల కొఱకు వచ్చిన రైతుల కు సిబ్బంది సకాలంలో స్పందించి రుణ ప్రక్రియ వేగవంతం చేస్తున్నారని చెప్పారు. గత ఏడాది సొసైటి ద్వారా  ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయడం ద్వారా  సొసైటీకి సుమారు 36 లక్షల కమీషన్ ప్రభుత్వం నుండి రావాల్సి ఉందని అన్నారు.

ఈ సమావేశం లో దెందులూరు ఏ ఎం సి చైర్మన్ మేకా లక్ష్మణరావు మాట్లాడుతూ రైతులు సొసైటీ ద్వారా అందించే రుణాలు సద్వినియోగం చేసుకుని సొసైటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ముందుగా సొసైటీ కార్యదర్శి టి ఎస్ ఆర్ మూర్తి సొసైటీ వార్షిక బడ్జెట్, రుణాలు, రికవరీ ఖర్చులు జమలు  వంటి వివరాలు సభ్యులకు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ పర్సన్ ఇంచార్జ్ లు ఎం వసంతారావు. కొనకళ్ల విజయలక్ష్మి రైతులు పాల్గొన్నారు.

Related posts

గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులకు తొలి అడుగు

Satyam NEWS

నీటిలో కొట్టుకొస్తున్న మృతదేహాలు

Satyam NEWS

బాబూ జగజ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment