40.2 C
Hyderabad
April 29, 2024 17: 33 PM
Slider కడప

గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులకు తొలి అడుగు

రాజంపేట వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ వచ్చిన సమయం ఆసన్నమయింది. కడప – రేణిగుంట మధ్య నిర్మించే గ్రీన్ ఫీల్డ్ నాలుగు లైన్ల హైవే ( ఎన్ హెచ్-716) నిర్మాణానికి సంబంధించిన పనులకు శనివారం సాయంత్రం తొలి అడుగు పడింది.అందులో భాగంగా కూచివారిపల్లె సమీపంలో ఉన్న పాల కేంద్రం పక్కన క్లీన్ అండ్ గ్రబ్బింగ్ పనులను గ్రీన్ ఫీల్డ్ హైవే లైజనింగ్ ఆఫీసర్ హర్షాభిరామ్ అధ్వర్యంలో ప్రారబించారు.

క్లీన్ అండ్ గ్రబ్బింగ్ పనులు రెండు నెలల్లో పూర్తి కానున్నాయి. 2,200 కోట్లతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరగనుంది. కడప నుంచి చిన్నఓరంపాడు వరకు 64 కిలో మీటర్లు ఒక ప్యాకేజీ కింద, చిన్నఓరంపాడు నుంచి రేణిగుంట వరకు 59 కిలో మీటర్ల మేర రెండవ ప్యాకేజీ కింద ఈ హైవే నిర్మాణం జరగనుంది. ఇదిలా ఉంటే కడప – రేణిగుంట మధ్యలో 52 లైట్ వెహికల్ అండర్ పాస్ (ఎల్ వీయూపి) బ్రిడ్జిలు, 8 వెహికల్ అండర్ పాస్ ( వీయూపీ), 72 మేజర్ అండ్ మైనర్ బ్రిడ్జిలు, 240 కల్వర్ట్ లు, 3 రైల్వ్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి (అర్ఓబీ)లను నిర్మించనున్నారు.

Related posts

నిరుద్యోగ పట్టభద్రులు ఓటింగ్ కు రాకుండా వైసీపీ కుట్ర

Satyam NEWS

నెల్లూరు నగర వీధులు ఎంపీ ఆదాలకు ఘన స్వాగతం

Bhavani

టీటా గ్లోబ‌ల్ ఎన్నారై జాయింట్ సెక్ర‌ట‌రీగా భాస్క‌ర్ గుప్త‌ న‌ల్ల‌

Satyam NEWS

Leave a Comment