24.7 C
Hyderabad
February 10, 2025 22: 29 PM
Slider ముఖ్యంశాలు

ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయందే కీలక పాత్ర

governor

భారతదేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యాన్ని సాధించడంలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు పంట, ఎగుమతి కేంద్రీకృత వ్యవసాయ వ్యవస్థను రూపొందించడంపై దృష్టి సారించాయని తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్ తమిళిసై సౌందరాజన్ అన్నారు.

రాజేంద్రనగర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (NAARM) లో వ్యవసాయ పరిశోధన సేవలకు సంబంధించిన 110 వ ఫౌండేషన్ కోర్సు (FOCARS) ను గవర్నర్ ప్రారంభించారు. 22 రాష్ట్రాలకు చెందిన 135 మంది యువ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్.ఏ.ఏ.ఆర్.ఎం లో వ్యవసాయ పరిశోధన సేవల్లో 3 నెలల శిక్షణ పొందనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తుచేసుకున్న ఆమె, వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా సన్నకారు  రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఎంతో ఉందని అన్నారు. క్రెడిట్ కార్డుల మాదిరిగానే, రైతులకు సాయిల్ కార్డులు ఉపయోగపడతాయని, ఇది వ్యక్తిగత పొలాలకు అవసరమైన పోషకాలు, పంటల వారీగా ఎరువులను సిఫారసు చేస్తుందని అన్నారు.

ఆధునిక వ్యవసాయ పద్దతులను సవ్యమైన రీతిలో ఉపయోగించడం ద్వారా ఉత్పాదకతను మెరుగుపరచడానికి రైతులకు సహాయపడుతుందని అన్నారు. పాల ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని గవర్నర్ అన్నారు. ఆవులకు దేశంలోనే అతిపెద్ద మొబైల్ టీకా కార్యక్రమం ప్రస్తుతం జరుగుతోందని, యుఎస్‌లోని కొన్ని కంపెనీలు పశువులలో కృత్రిమ గర్భధారణను ఉపయోగిస్తున్నాయని తెలిపారు.

వ్యవసాయ రంగంలో రావాల్సిన నూతన ఆవిష్కరణల ప్రాధాన్యతలపై గవర్నర్ మాట్లాడుతూ, వ్యవసాయంలో మానవ వనరుల కొరత బాగా ఉందన్నారు. వ్యవసాయ విద్య, పరిశోధన మరియు విస్తరణ సేవలను ఈ రంగానికి విస్తరించాలని, వ్యవసాయ విద్య, పరిశోధనలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ అన్నారు.

పరిశోధనల ఆధారంగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. ప్రతి రాష్ట్రం, ప్రాంతానికి వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉన్నాయని ఆమె తెలిపారు. యువ వ్యవసాయ శాస్త్రవేత్తలు రెండవ హరిత విప్లవం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రతి శాస్త్రవేత్త రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రయత్నించాలని,  వ్యవసాయ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ తెలిపారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా శిక్షణ తీసుకోవాలని గవర్నర్ సూచించారు.

Related posts

మానవత్వం చాటుకున్న కృష్ణా జిల్లా పోలీసులు

Satyam NEWS

తిరుమల శ్రీవారి ఆలయంలో వేడుక‌గా పార్వేట ఉత్స‌వం

Satyam NEWS

విశాఖ రేంజ్ డీఐజీ న‌గరానికి రాక‌….పోలీసుల బందోబ‌స్తు హ‌డావుడి…!

Satyam NEWS

Leave a Comment