23.7 C
Hyderabad
May 8, 2024 03: 52 AM
Slider నల్గొండ

వందేళ్ళ ఘనచరిత్ర ఎ ఐ టి యు సి కె దక్కింది

#AITUCSuryapet

కార్మిక శక్తి గర్వపడే విధంగా  ఎ ఐ టి యు సి ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని ఎ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాసరావు అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని CPI కార్యాలయంలో గురువారం ఎ ఐ టి యు సి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మేకల శ్రీనివాసరావు మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31వ తేదీన ముంబై మహానగరంలో పుట్టి ఈనాటి వరకు కార్మికుల యొక్క సమస్యలపై పోరాటాలు చేస్తూ, విజయాలు సాధించిన ఘనత ఎ ఐ టి యు సి కే దక్కుతుందని అన్నారు.

కార్మికుల పక్షాన నిలబడిన ఏకైక కార్మిక సంఘం ఎ ఐ టి యు సి అని కొనియాడారు. పనికి తగిన వేతనం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇప్పించటంలో, సుదీర్ఘ పోరాటాలు నిర్వహించి, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న  ఘనచరిత్ర ఎ ఐ టి యు సి  కి దక్కిందని అన్నారు.

నేటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా కార్మిక సంఘం సభ్యులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా జిల్లా నాయకులు టి. సుధాకర్ రెడ్డి, ఎ. శ్రీనివాసు, హిందీ రాళ్ల వెంకటేశ్వర్లు,

AIYF ముఖ్య నాయకులు యల్లావుల రమేష్, పట్టణ సిపిఐ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, కార్మిక నాయకులు ములకలపల్లి శ్రీనివాసు, జెట్టి ప్రసాదు, జానయ్య, రాంబాబు,  శీలం వీరయ్య,జక్కుల మల్లయ్య, రాములు, యం.వెంకటేశ్వర్లు, కొట్టు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related posts

విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు జీవీఎల్ ప్లాన్

Satyam NEWS

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట కన్నుమూత

Bhavani

ఎక్సయిజ్ పోలీసుల దాడిలో పట్టుబడ్డ బెల్లం, పటిక

Satyam NEWS

Leave a Comment