29.7 C
Hyderabad
May 2, 2024 05: 39 AM
Slider నల్గొండ

తెలంగాణ వ్యవసాయ విధానం దేశంలోనే నెంబర్ వన్

#PAC

తెలంగాణ రైతాంగ విధానాన్ని దేశంలో  నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుదే అని ఉమ్మడి నల్గొండ డి‌సి‌సి‌బి ఛైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచెర్ల మండల కేంద్రంలో గురువారం సహకార సంఘ బ్యాంక్ ATM ను ప్రారంభించిన పిదప ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 120 కోట్ల రూపాయలు జిల్లా సహకార సంఘాల ద్వారా రైతులకు పావల వడ్డీ కే ఇవ్వడం జరిగినదని అన్నారు.

నియోజకవర్గంలో 25 కోట్లు ద్వ్వ్ర్ఘకాలిక ఋణాలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఆత్మ నిర్భన్ పథకం ద్వారా అర్హులైన లబ్దిదారులకు 1.60 లక్షల విలువైన గేదెలను ఇవ్వటం జరుగుతున్నదని అన్నారు.  KCR ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటారని అన్నారు.

శాసన సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ రైతు వేదికలను , సహకార సంఘాలను బలోపేతం చేయడం ద్వారా రైతులకు లబ్ది చేకూర్చే మార్గ దర్శకాలను రూపొందించడమే టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వ లక్షమని అన్నారు. సొసైటీ చైర్మన్లు వారి పరిధిలోని రైతులకు  సకాలంలో నిధులు మంజూరు చేసి  సహకరించాలని కోరారు.

నిరుద్యోగ యువత శాస్త్ర సాంకేతికను వినియోగించుకొని ఆధునిక వ్యవసాయం ద్వారా లబ్దిపొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో DCCB CEO మదన్ మోహన్, మున్సిపల్ ఛైర్మన్ చందమల్ల జయబాబు, వైస్ చైర్ పర్సన్ చల్లా శ్రీలత రెడ్డి,

ఎం‌పి‌పి లకుమల్ల జ్యోతి, జెడ్‌పి‌టి‌సి రాపోలు నర్సయ్య, వైస్ ఎం‌పి‌పి తాళ్ళూరి లక్ష్మినారాయణ , మండల పార్టీ అధ్యక్షుడు సోమిరెడ్డి, DCCB డైరెక్టర్లు దొండపాటి అప్పిరెడ్డి, రంగాచార్యులు, PACS చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి ఇక కష్టకాలం

Satyam NEWS

వ‌రుస ద‌ర్నాల‌తో ద‌ద్ద‌రిల్లిన క‌లెక్ట‌రేట్ ప్రాంగణం…!

Satyam NEWS

గ్లామర్: దిల్ సుఖనగర్ లో టాలీవుడ్ నటి సందడి

Satyam NEWS

Leave a Comment