28.7 C
Hyderabad
May 6, 2024 01: 56 AM
Slider విజయనగరం

రెండో భ‌ద్రాద్రిలో వైభ‌వోపేతంగా జర‌గ‌నున్న‌ శ్రీరామ‌న‌వ‌మి వేడుకలు…!

#anil

స‌త్యం న్యూస్.నెట్ ప్ర‌తినిదితో  విజ‌య‌న‌గ‌రం ఏఎస్పీ అనిల్…!

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని నె్ల్లిమ‌ర్ల మండ‌లం రామ‌తీర్ధంలో ఈ నెల 10 వ తేదీన ఆదివారం శ్రీరామ న‌వ‌మి సంద‌ర్బంగా దాదాపు 200 మంది సిబ్బందితో బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్న‌ట్టు  జిల్లా ఏఎస్పీ, విజ‌య‌న‌గ‌రం ఇంచార్జ్ డీఎస్పీ అనిల్  చెప్పారు. ఈ  మేర‌కు  ఏఎస్పీ మాట్లాడుతూ విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మ‌రో భ‌ద్రాద్రిగా ప్ర‌సిద్దిగాంచిన రామ‌తీర్దం  దేవ‌స్థానంలో ఈ నెల 10 శ్రీరామ న‌వ‌మి సంద‌ర్బంగా భ‌క్తులు ప్ర‌శాంతంగా అల్ల‌ర్లు జ‌ర‌గ‌కుండా ప్ర‌శాంతంగా ద‌ర్శ‌నం చేసుకునేందుకు పోలీసులు త‌మ వంతు బాధ్య‌త‌గా గట్టి బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్న‌ట్టు ఏఎస్పీ విజ‌య‌న‌గ‌రం ఇంచార్జ్ డీఎస్పీ అనిల్ తెలిపారు.

ఈ మేర‌కు దేవాదాయ‌,రెవిన్యూ,ఆర్టీసీ  అలాగే హెల్త్ శాఖ‌ల‌తో స‌మ‌న్వ స‌మీక్ష స‌మావేశంలో ప‌లు కీల‌క  సూచ‌న‌లు తీసుకున్న విదంగా చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్టు ఏఎస్పీ తెలిపారు.గ‌త ఏడాది క‌రోనా కారణంలో భ‌క్తుల తాకిడి లేద‌ని ఈ సారి క‌రోనా ఆంక్ష‌లు లేక‌పోవ‌డంతో భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంద‌ని దేవాదాయ శాఖ చెప్ప‌డంతో  దాదాపు 200మంది బందోబ‌స్తు ఏర్పాటు చేసామ‌ని తెలిపారు.మొత్తం పోలీసు బందోబ‌స్తుకు తాను ఇంచార్జ్ వ్య‌వ‌హ‌రిస్తున్నాన‌ని…అలాగే రామ‌తీర్ధం  వ‌ద్ద ఉన్న కొల‌నులో భ‌క్తులు క‌ల్యాణం అనంత‌రం  స్నానం ఆచ‌రించేంద‌కు అందుకు ఎస్డీఆర్ ఎఫ్ బృందాలు సిద్దంగా ఉంచుతున్నామ‌ని తెలిపారు.

చుట్ట‌ప‌క్క‌ల అయిదు గ్రామాలలో కూడా మ‌ప్టీలో స్పెష‌ల్ పోలీసు బృందాలు గ‌స్తీ ఉంచుతున్నామ‌న్నారు.కరోనా ఆంక్ష‌లు ఎత్తేయ‌డంతో శ్రీరామ‌న‌విమి కి భక్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా వ‌స్తార‌ని దేవాదాయ శాఖ చెప్ప‌డంతో  ఎస్పీ దీపిక ఆదేశాల‌తో సాధ్య‌మైనంత‌మంది ఎక్కువ సిబ్బందితో  రామ‌తీర్ధంలో బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్న‌ట్టు ఏఎస్పీ అనిల్ చెప్పారు.

Related posts

విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం

Satyam NEWS

వచ్చే ఫిబ్రవరి 14కు నాగచైతన్య సినిమా విడుదల

Satyam NEWS

బాబామెట్ట హజరత్ ఖాదర్ వలీ బాబా వారి ఆశ్ర‌మంలో ఎమ్మెల్యే కోలగట్ల

Satyam NEWS

Leave a Comment