26.7 C
Hyderabad
April 27, 2024 08: 03 AM
Slider కడప

బద్వేలు ఉపఎన్నికలో వైస్సార్సీపీ కక్కుర్తి రాజకీయాలు

#navataramparty

బద్వేలు ఉపఎన్నికల సందర్భంగా వైస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్ పాసుల కోసం కక్కుర్తి రాజకీయాలు చేయడం, అధికార పార్టీ దిగజారి ఇతర పార్టీల బీఫారాలు పొంది నామినేషన్లు వేయించడం యావత్తు ప్రజానీకం గమనిస్తున్నారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.

సాక్షాత్తు మన పార్టీ అభ్యర్థి తో బద్వేలు మునిసిపల్ చైర్మన్ ప్రక్కనే ఉండి నామినేషన్ వేసిన సంగతి ఓటర్లు గమనిస్తున్నారని తెలిపారు. ముందు ముందు ఇలాంటివి చాలా జరుగుతాయని అన్నారు. బద్వేలు రిటర్నింగ్ అధికారి మన పార్టీ అభ్యర్థి లాంటి అభ్యర్థులు ఎందరున్నారో గుర్తించి వారి నామినేషన్ తిరస్కరించాలని లేదా వారికి పాసులు నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈమేరకు నవతరం పార్టీ నుండి సీఈవో కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో అధికార పార్టీపై నిఘా ఏర్పాటు చేయాలని లేకుంటే డబ్బు,మద్యం పంపిణీ చేసేందుకు వీలుంది అని తెలిపారు. నవతరం పార్టీ అభ్యర్థి డాక్టర్ గోదా రమేష్ కుమార్ నిబంధనల ప్రకారమే నడుచుకుంటారని తెలిపారు.

Related posts

లెక్చరర్లకు, టీచర్లకు గౌరవ వేతనం కోసం ఎంఐఎం దీక్ష

Satyam NEWS

ఈ బఫూన్లు చెబితే చంద్రబాబు బెయిల్ రద్దు చెయ్యాలా?  

Satyam NEWS

పేర్లు మార్పుతో బతుకులు మారుతాయా ?

Satyam NEWS

Leave a Comment