39.2 C
Hyderabad
May 3, 2024 11: 46 AM
Slider ప్రత్యేకం

జాతీయ అవార్డు లలో 30శాతం తెలంగాణకే

#kcr

పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పలు అభివృధ్ధి ఇతివృత్తాలు (థీం) విభాగాల్లో తెలంగాణ పంచాయతీలు దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచిన నేపథ్యంలో గౌరవ రాష్ట్రపతి ద్రౌపది శ్రీమతి ముర్ము చేతులమీదుగా న్యూ ఢిల్లీలో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు అందుకోవడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 46 ఉత్తమ అవార్డుల్లో 13 అవార్డులను తెలంగాణ రాష్ట్రమే కైవసం చేసుకోవడం మనందరికీ గర్వకారణమని సీఎం అన్నారు.

దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల్లో 9 థీం ఆధారిత విభాగాల్లో అవార్డుల ఎంపిక జరగగా, 8 విభాగాల్లో తెలంగాణ రాష్ట్రమే అవార్డులను సాధించడం విశేషమని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు ఈ అవార్డుల కోసం పోటీ పడగా అందులో కేవలం 46 గ్రామాలు మాత్రమే అవార్డులు దక్కించుకున్నాయి. ఇందులోంచి 13 అవార్డులు తెలంగాణకే వచ్చినయి. అంటే ప్రకటించిన మొత్తం జాతీయ అవార్డుల్లో 30శాతం తెలంగాణ రాష్ట్రమే కైవసం చేసుకున్నది.

ఈ 13 ర్యాంకుల్లోంచి కూడా 4 ఫస్టు ర్యాంకులు తెలంగాణకే రావడం గొప్పవిషయం.’’ అని సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో జరిగిన పంచాయతీల ప్రోత్సాహకం పై జాతీయ సదస్సు – అవార్డుల ప్రదానోత్సవం’’ కార్యక్రమంలో ఈ జాతీయ ఉత్తమ అవార్డులను, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకోవడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును, కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు మరియు పంచాయితీరాజ్ శాఖ అధికారులను సీఎం అభినందించారు.

పల్లె ప్రగతి సహా గ్రామీణాభివృద్ధి దిశగా దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి కార్యాచరణకు ఈ అవార్డులు సాక్ష్యంగా నిలిచాయని సీఎం అన్నారు. పంచాయతీల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ప్రతి అంశంలోనూ అగ్రగామిగా నిలిచి, అత్యధిక అవార్డులు గెలుచుకున్న స్ఫూర్తితో తెలంగాణ ఆదర్శంగా దేశవ్యాప్తంగా పల్లెల అభివృద్ధికోసం తమ కృషి కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు.

Related posts

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ ఉత్సవాలు

Satyam NEWS

అందరూ తాగండి, తాగించండి ఆరోగ్య ద్రావకం నీరా

Satyam NEWS

మానవత్వం చాటిన జనచైతన్య ట్రస్ట్

Bhavani

Leave a Comment