40.2 C
Hyderabad
May 2, 2024 18: 36 PM
Slider ఆదిలాబాద్

అన్ని శాఖల సమన్వయంతోనే ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధి

#asifabad

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందుండేలా చూడాలని కేంద్ర సమాచార, ప్రసార, మత్స్య, పశు సంవర్ధక, పాడి శాఖ సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆకాంక్ష భరిత జిల్లా కార్యక్రమంలో భాగంగా  కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి,సంక్షేమ పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. బాల్య వివాహాలు అరికట్టడానికి జిల్లా అధికారులు కృషి చెయ్యాలని అన్నారు. పిల్లలు అందరూ చదువుకునేలా చూడాలని, అక్షరాస్యత ను పెంచేలా,చదువు మధ్యలో మానేసే వారిని గుర్తించి బడిలో చేర్పించాలని అధికారులకు సూచించారు.జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషిచేయాలని వెల్లడించారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అర్హులైన వారందరికీ ఉపాధి కల్పించాలని అన్నారు.

ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలందరికీ చేరేలా అధికారులు కృషి చెయ్యాలని తెలిపారు.మహిళా సమాఖ్య సంఘాల సభ్యులకు స్వయం ఉపాధి మార్గాలు చూపించాలని పేర్కొన్నారు. జిల్లా భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా గిరిజన ఆవాసాలన్నింటికి రహదారి సౌకర్యం కల్పించడానికి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద నిధులు మంజూరు చేయాలని స్థానిక శాసనసభ్యులు మంత్రిని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు బాపురావు, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎమ్మేల్యేలు ఆత్రం సక్కు,కోనేరు కోనప్ప, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అనంతరం క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ నిధులతో జనకపురి లో ఏర్పాటు చేసిన బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ ని సందర్శించారు.  ఆ తర్వాత ఎదులవాడ లో చేపల చెరువును సందర్శించి వివిధ రకాల చేపల పెంపకాన్ని గురించి అడిగి తెలుసుకొన్నారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

Related posts

ప్రతి పేదవాడికి నాణ్యమైన ఉచిత విద్య

Murali Krishna

బూతులు మాత్రమే మాట్లాడే నేతలూ ఈ వీడియో చూడండి

Satyam NEWS

ప్రమాద బాధితురాలికి లయన్స్ క్లబ్ ఆర్ధిక సాయం

Satyam NEWS

Leave a Comment