29.7 C
Hyderabad
May 7, 2024 03: 24 AM
Slider మెదక్

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన హరీష్

#ministerharishrao

ఆదివారం మెదక్ జిల్లా పర్యటనలో ఉన్న ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి  హరీశ్ రావు.. మధ్యలో  టేక్మాల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం రాత్రి ఓ మహిళకు  సాధారణ ప్రసవం జరిగిందని స్థానిక నేతల ద్వారా తెలుసుకున్న మంత్రి.. ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా పి.హెచ్.సిని సందర్శించారు.

తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెల్సుకున్నారు. ఇతర పేషెంట్లను పలుకరించారు. ఆసుపత్రిలో అందుతున్న సేవల పట్ల ఆరా తీశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. ఆదివారం కూడా సిబ్బంది హాజరై పూర్తి సేవలు అందిస్తుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు అవసరమైన మందులు అందిస్తున్నామని, ప్రసవం అయిన తర్వాత తల్లులకు కేసీఆర్ కిట్ ఇస్తున్నామని సిబ్బంది మంత్రికి చెప్పారు.

Related posts

మధ్యంతరం బెయిల్ రావడం మంచిదే

Satyam NEWS

పౌరసత్వ చట్టాన్ని విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

Satyam NEWS

కోవాక్సిన్: అతి త్వరలో కరోనా వ్యాక్సిన్ రెడీ

Satyam NEWS

Leave a Comment