31.2 C
Hyderabad
May 3, 2024 01: 12 AM
Slider ప్రత్యేకం

పండుగ వాతావరణంలో పాఠశాలలు ప్రారంభం

#sabitha

రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు – మన బడి మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1న పండుగ వాతావరణంలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు రూపుదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో చేపట్టిన 12 రకాల సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఈ పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1200 పైచిలుకు పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. పనులన్నీ పూర్తి చేసుకున్న పాఠశాలలను అన్ని నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 1న ప్రారంభిస్తామని ఆమె వెల్లడించారు. ఏదైనా నియోజకవర్గంలో ప్రారంభానికి సిద్ధమైన పాఠశాలలు ఎక్కువ సంఖ్యలో ఉంటే కొన్నింటిని తదుపరి రోజుల్లో చేసుకోవచ్చని సూచించారు.

జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ లతో సమన్వయం చేసుకొని ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆమె ఆదేశించారు. రాష్ట్రంలోని 26,055 స్కూళ్లను మూడేళ్లలో మూడు దశల్లో రూపురేఖలు మార్చేయాలని సంకల్పించిందని తెలిపారు. మొదటి విడతలో 9,123 పాఠశాలలను 3,497.62 కోట్లతో ఆధునికీకరిస్తున్నమని పేర్కొన్నారు.

Related posts

బీజేపీ నేత‌లు నోరు అదుపులో పెట్టుకోవాలి

Satyam NEWS

బ్రుటల్ : 24 ఏళ్ల దళిత యువకుడికి నిప్పెట్టారు

Satyam NEWS

సుప్రీం కోర్టు లో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Satyam NEWS

Leave a Comment