38.2 C
Hyderabad
April 29, 2024 22: 12 PM
Slider ఖమ్మం

అన్ని పండుగలు సంతోషంగా జరుపుకోవాలి

#puvvada

తెలంగాణ రాష్ట్రంలో  అన్ని మతాల పండుగలను ప్రభుత్వమే అధికారికంగా ఘనంగా నిర్వహించి, ఆయా మతాల్లోని పేదవారికి  నూతన వస్త్రాలను అందజేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాబోయే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వంచే పేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా కేంద్రంలో మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. మంత్రి ఖమ్మం నగరంలోని సహకార నగర్ డేఫానికల్ చర్చ్, రోటరీ నగర్ లోని గుడ్ షెపర్డ్ చర్చ్,  అల్లీపురం రోడ్ లోని దైవ కృపా మందిరం, గుట్టలబజార్ లోని సెయింట్ జోసఫ్స్ చర్చి ఆవరణ సెయింట్ పాల్స్ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్ర్మిస్మస్ సంబురాలను ఘనంగా నిర్వహించుకోవడంతో పాటు, పండుగను సంతోషంగా జరుపుకునే విధంగా క్రైస్తవులకు కొత్త బట్టలను అందించడం జరుగుతుందని అన్నారు. పేదవారు, పెద్దవారు ఒకేలా సంతోషంగా పండుగలు జరుపుకోవాలన్నదే ప్రభుత్వ అభిమతమని ఆయన అన్నారు. నూతన వస్త్రాలు అందించడం తో పాటు ప్రభుత్వంచే విందు ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు.  

భిన్నత్వంలో ఏకత్వంగా సర్వమతాల సమ్మేళనంగా ఉన్న భారతదేశంలో అందరి అభ్యున్నతిని కాంక్షిస్తు అన్ని మతాలను ఐక్యం చేస్తూ, అందరు సోదరభావంతో మెదిలేలా అన్ని చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.  ఈ సందర్భంగా ఆయా చర్చిల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ ను మంత్రి కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసు ప్రభువు ప్రజలందరినీ చల్లగా చూడాలని అభిలాషించారు.  ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీ ప్రసన్న, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహమూది, కార్పొరేటర్లు పగడాల శ్రీవిద్య, రావూరి కరుణ, యర్రా గోపి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, క్రైస్తవ పెద్దలు జాన్ కాంతారావు, బాలస్వామి, సత్యపాల్, వేము సత్యం, లాజర్, అనిల్, ఎన్. సమూయేలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జగన్ ను ఇరకాటంలో పెడుతున్న ‘గురు ఛండాల యోగం’

Satyam NEWS

వేగంగా వ్యాక్సినేషన్ చేస్తున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు

Satyam NEWS

సీఎం కేసీఆర్ డిమాండుకు స్పందించిన కేంద్రం

Satyam NEWS

Leave a Comment