24.7 C
Hyderabad
March 26, 2025 09: 41 AM
Slider ముఖ్యంశాలు

ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ ఎఫ్ జాతీయ నాయకుల నియామక అభినందన సభకు తరలి రావాలి

#mrps

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం ఎస్సీ సి ఏ బి సి డి వర్గీకరణపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న జాప్యం,విధానాలపై ఒత్తిడి తేవాడం కోసం మంద కృష్ణ మాదిగ నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్రంలో నూతన ఎమ్మార్పీఎస్,ఎం ఎస్ ఎఫ్ జాతీయ నాయకులను నియమించడం జరిగింది.

నియమించిన నాయకులకు మే నెల మూడవ తేదీన ఉమ్మడి నల్లగొండ  జిల్లాలో అభినందన సభ జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా కో-ఆర్డినేటర్ కందుకూరి సోమన్న మాదిగ హాజరై హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సమీక్ష సమావేశం నిర్వహించి తెలియజేసి హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రామారావు మాదిగ,రెడపంగు వెంకటేశ్వర్లు,కస్తాల ముత్తయ్య, నియోజకవర్గ నాయకులు బాల చంద్రుడు మాదిగ,బచ్చలికూరి ప్రసాద్ మాదిగ,గరిడేపల్లి మండలం నాయకుడు యడవెల్లి చంద్రయ్య మాదిగ,చింతలపాలెం మండలం నాయకుడు రుద్రపంగు రమేష్ మాదిగ, వి హెచ్ పి ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి అమరారపు సైదులు,మఠంపల్లి మండలం సీనియర్ నాయకుడు గుండెపంగు కృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సంభవామి యుగే యుగే

Satyam NEWS

రెడ్ ఎలర్ట్: కరోనా వైరస్ తో దేశంలో మూడో మరణం

Satyam NEWS

అకాల వర్ష బాధితులకు తక్షణ సాయం

Satyam NEWS

Leave a Comment