39.2 C
Hyderabad
April 28, 2024 11: 16 AM
Slider కడప

నిత్యావసర ధరల పెరుగుదల ఆపలేకపోయిన సీఎం జగన్

#kadapaTDP

ధరల స్థిరీకరణ లో సి ఎం జగన్మోహన్ రెడ్డి పూరిగా విఫలమయ్యారని టిడిపి  పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులురెడ్డి అన్నారు. గడిచిన మూడు సంవత్సరాలుగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకుంటూ పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆయన అన్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ కడపజిల్లా రాయచోటి నియోజకవర్గ  తాసిల్దార్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. మహా ధర్నా అనంతరం ఆర్ ఐ అజహర్ అలీ ఖాన్ కి  వినతి పత్రం అందచేశారు. ధరలు నియంత్రణ చేయలేని సీఎం వెంటనే గద్దె దిగిపోవాలని నినాదాలు చేశారు. పేద ప్రజల సంక్షేమమే జగన్నన్న లక్ష్యం అంటూ వారి జీవనప్రమానాలను గాలికి వదిలేశారని శ్రీనివాసులురెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలో దించేశారని ఆయన అన్నారు. సినిమా టికెట్ ధరల పై ఉన్న చిత్తశుద్ధి మూడుపూటల పేద ప్రజల కడుపు నింపడంలో లేదా అని ప్రశ్నించారు. నిత్యావసరాల ధరల స్థిరీకరణ జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని తెలిపారు. ఈ ధర్నాలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ భాష, టిడిపి పట్టణ అధ్యక్షుడు బోనమల ఖాదర్ వలి, టిడిపి నాయకులు నర్సారెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు నవీన్ కుమార్ రెడ్డి, అనుపల్లి రాంప్రసాద్ రెడ్డి,టిడిపి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Related posts

దస్తావేజు లేఖరుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది

Satyam NEWS

నాన్నా.. నువ్వే నా బ‌లం……!

Satyam NEWS

ప్ల‌యింగ్ స్క్వాడ్ దాడులు ప్రైవేటు హాస్ప‌ట‌ల్ పై కేసు….!

Satyam NEWS

Leave a Comment