28.7 C
Hyderabad
May 14, 2024 23: 22 PM
Slider ప్రత్యేకం

అమ‌రాతిలో “బిగ్ డిబేట్ “: అశోకుడి స్థానంలో గీత‌….!

#ashokgajapatiraju

విజయనగరం టీడీపీ కి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది…. ఇక్కడి పంచాయతీ అక్కడికి చేరింది….ఇక్కడిది అంటే విజయనగరానిది…అక్కడికి అంటే అమరావతికి… ఈ పంచాయతీ మరెక్కడికో కాదు… సాక్షాత్తూ పెద్ద నాయుడు చంద్రబాబు దగ్గరకే…..ఉమ్మడిగా కావచ్చు.. లేదా జిల్లాల విభజన తర్వాత కావచ్చు….విజయనగరం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికీ అశోకుడే రాజు… రారాజు…. కాబట్టే ఇప్పటి వరకూ ఆయన తప్పించి రెండో దిక్కు లేదు… కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి… వ్యవస్థలూ మారాయి… రాజకీయాల స్వరూపమే మారిపోయింది…

బాధ పడితే గానీ బోధపడదని గత ఎన్నికల నాటి నుంచి ఈనాటి వరకూ అనుభవ రీత్యా బాగా ఒంటబట్టించుకున్న చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు… తాజా రాజకీయాలకు అనుగుణంగా సూక్తి ముక్తావళి మొదలుపెట్టారు… ఈయనకు తెలియదని కాదు గానీ ” అనువు కాని చోట అధికులమని అనకూడదని ”  అశోకుడికి నూరిపోశారు….అశోకుడు కూడా బాబు నమకం , చమకం విన్నారు…. కాబట్టే ఊ… ఊ..ఉహూ….అనకుండా  ఊ కొట్టారు….

ఈ క్రమంలోనే ఆ బాబు శుక్రవారం బిగ్ డిబేట్ పెట్టారు… ఈ డిబేట్ కి రావాలని ఈ బాబుకి (అశోక్ గజపతికి) పిలుపొచ్చింది… ఇందులో వింతేమీ లేదు… ట్విస్ట్ ఏంటంటే శుక్రవారం జరిగే డిబేట్ కి మీసాల గీతతో పాటు ఆమె అనుయాయులకు కూడా కబురు అందింది… అది కూడా ఎక్కడి నుంచో కాదు… సాక్షాత్తూ అశోకుడి బంగ్లా నుంచే…. ఇదే ప్రస్తుతం ఆ పార్టీలో బర్నింగ్ టాపిక్… అశోక్ గజపతి అంగీకారం లేకుండా ఆయన బంగ్లా నుంచి పిలుపు ఎలా వస్తుందీ అని చర్చ….

రేపు ఏం జరగబోతోందని తెలుగు తమ్ముళ్ళు, అన్నయ్యల్లో ఉత్కంఠ… వీళ్ళంతా ఇలా ఉంటే  ” రాజు వెడలె రవి తేజంబలరగ ” అనే టైపులో అశోక్ గజపతి పెదరాయుడి పంచాయతీకి పయనమయ్యారు…. గీత, ఆమె అనుయాయులు కూడా అదే దారి పట్టారు… విన్నింగ్ మోడ్ లో రాజకీయాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్న (ప్రస్తుతానికి ) అశోక్ గజపతి కి, సామాజికవర్గ పరంగా రన్నింగ్ మోడ్ లో ఉన్న గీతకి, ఆఫ్ లైన్ మోడ్ లో ఉన్న అదితికి పెద రాయుడు ఏం చెబుతారో , వీళ్ళంతా ఏమంటారో వేచి చూడాలి..!!.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

జిల్లా సంక్షేమ అధికారిగా  స్వర్ణలత లేనీనా

Murali Krishna

స్వామీ అయ్యప్పా ఈ వివాదాలు నిన్ను ఆపగలవా?

Satyam NEWS

మంత్రి ఆదేశంతో సెల్లార్ నీటిని క్లియర్ చేసిన అధికారులు

Sub Editor

Leave a Comment