33.2 C
Hyderabad
May 4, 2024 00: 00 AM
Slider విజయనగరం

ప‌ల్స్ పోలియోను విజ‌య‌వంతం చేయండి

#suryakumariias

స‌చివాల‌య సిబ్బంది అంతా త‌ప్ప‌నిస‌రిగా యూనిఫాం ధ‌రించాల‌ని ఏపీలోని  విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. జిల్లాలోని గ‌రివిడి మండ‌లం కొండ‌పాలెంలోని 1,2,3 స‌చివాల‌యాల‌ను క‌లెక్ట‌ర్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ప‌లువురు సిబ్బంది యూనిఫాం  ధ‌రించ‌క‌పోవ‌డంపై ప్ర‌శ్నించారు. ఆయా స‌చివాల‌యాల్లో రిజిష్ట‌ర్ల‌ను, సిబ్బంది హాజ‌రును ప‌రిశీలించారు. వివిధ ర‌కాల ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉండ‌టంపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. దానికి కార‌ణాల‌ను ప్ర‌శ్నించారు. జ‌గ‌న‌న్న కాల‌నీల నిర్మాణం, ఓటిఎస్ ప‌థ‌కం అమ‌లుపై ఆరా తీశారు.  కోవిడ్ వేక్సినేష‌న్ గురించి ప్ర‌శ్నించారు. మంజూరు చేసిన ప్ర‌తీ ఇంటి నిర్మాణాన్ని త‌క్ష‌ణ‌మే ప్రారంభించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ల‌బ్దిదారులు ముందుకు రాని ప‌క్షంలో, వారికి ఇంటిని ర‌ద్దు చేసి, ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఇత‌రుల‌కు కేటాయించాల‌ని సూచించారు.  ఇసుక‌, సిమ్మెంటు, ఇనుము ప్ర‌భుత్వ‌మే స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని, ల‌బ్దిదారుడు ఇంటిని క‌ట్టి తీరాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తీ గ్రామంలో చెత్త‌శుద్ది కేంద్రాన్ని త‌ప్ప‌నిస‌రిగా వినియోగంలోకి తీసుకురావాల‌ని చెప్పారు. చెత్త‌ను త‌గుల‌బెట్ట‌కూడ‌ద‌ని, దానిని వేరు చేసి, త‌డిచెత్త‌తో ఎరువును త‌యారు చేయాల‌ని సూచించారు. ఆదివారం నిర్వ‌హించ‌నున్న ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని, ప్ర‌తీఒక్క‌రికీ పోలియో చుక్క‌ల‌ను వేయాల‌ని క‌లెక్ట‌ర్‌ సూచించారు. ఈ త‌నిఖీల్లో తహ‌శీల్దార్ టి.గోవింద‌, మండ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Related posts

ఆనందయ్యను నిర్భందంలో ఉంచి మందు చేయిస్తారా? న్యాయమేనా?

Satyam NEWS

రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలకు మొబైల్స్ పంపిణీ

Satyam NEWS

మాజీ ఎమ్మెల్యే ఆమంచికి పాము కాటు

Bhavani

Leave a Comment