42.2 C
Hyderabad
May 3, 2024 17: 28 PM
Slider ముఖ్యంశాలు

ఆనందయ్యను నిర్భందంలో ఉంచి మందు చేయిస్తారా? న్యాయమేనా?

#SomireddyChandramohanreddy

కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేవని తేలినా ఆనందయ్యను ఎందుకు నిర్బంధించి ఉంచారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.

ఆనందయ్యను నిర్భందంలో ఉంచి కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్ ఫౌండేషన్ బిల్డింగ్ లో అనధికారికంగా వేలాది మందికి తయారుచేయించుకుంటున్నారని ఆయన అన్నారు.

ఈ విషయాన్ని జన సేన నాయకులు వీడియో సహితంగా బయట పెట్టారని చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఆనందయ్య మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఆయుష్ కమిషనర్, స్టేట్ హెల్త్ సెక్రటరీ ప్రకటించినా…పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇవ్వరు..అంటూ ఆయన ఘాటుగా ప్రశ్నించారు.

ఆనందయ్య బీసీ కాకుండా అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి అయివుండుంటే ఇన్ని రోజులు అక్రమంగా నిర్బంధించేవారా అని ఆయన ప్రశ్నించారు. యాదవుడైన ఆనందయ్యను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం దురదృష్టకరమని చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

పేదలకు మాత్రం మందు పంపిణీ ఆపేసి పెద్దోళ్లకు మాత్రం ప్యాకెట్లు చేసి పంపిస్తున్నారు..ఇదెక్కడి న్యాయం అని ఆయన ప్రశ్నించారు.

ఎంతో సౌమ్యుడైన ఆనందయ్య తన తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ 40 ఏళ్లుగా ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్నారు..కోవిడ్ కు సంబంధించి కూడా 70 వేల మంది వరకు మందు తీసుకుంటే ఏ ఒక్కరూ నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదు..

ఇప్పుడే కాదు 40 ఏళ్లలో ఎప్పుడూ ఆనందయ్య మందు గురించి ఒక్క ఫిర్యాదు కూడా లేదు..అని చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఆనందయ్య మందు మింగానని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలిపారు..మందుపై పూర్తి నమ్మకం ఉందని ప్రకటించారు..ఒంగోలు వాసులందరూ కూడా ఆ మందు కోరుకుంటున్నారని వెల్లడించారు..

ఆ మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఆయుష్ కమిషనర్ రాములు ఇప్పటికే ప్రకటించారు.. రాష్ట్ర ప్రభుత్వ హెల్త్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు…ఇంకేం కావాలని చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.

మందు పంపిణీ విషయంలోనూ వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ప్రజలు క్షమించరని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. (వీడియో)

Related posts

ప్రజల కోసం పరితపించే నాయకుడు కేటీఆర్

Satyam NEWS

హైదరాబాద్ పాతబస్తీలో ప్రియురాలిని చంపిన ప్రియుడు

Satyam NEWS

క్రీడలు శారీరక దృఢత్వానికి, మనసిక ఉల్లాసానికి దోహదపడతాయి

Satyam NEWS

Leave a Comment