40.2 C
Hyderabad
May 1, 2024 16: 55 PM
Slider హైదరాబాద్

దోమల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలి

#mosqutos

ప్రజలు డెంగ్యూ బారిన పడకుండా  దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని బాగ్ అంబర్ పేట్ కార్పోరేటర్ పద్మ వెంకట్ రెడ్డి అధికారులను కోరారు. బాగ్ అంబర్ పేట్ డివిజన్ గజానంద్ గడ్డ, చిన్న గాంధీ బొమ్మ వీధిలో డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి ప్రజలు డెంగ్యూ బారిన పడకుండా  దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ జిహెచ్ఎంసి ఎంటమాలజీ సిబ్బందితో  ఇంటి ఇంటికి తిరుగుతూ దోమల నివారణ కొరకు తీస్కోవలసిన జాగ్రత్తలు వివరిస్తూ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దోమల నివారణకు ప్రజలందరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదేవిధంగా నీళ్లు నిలువ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కూలర్ లలో నిలువ ఉన్న నీటిని తరుచుగా శుభ్రం చేసుకోవాలి, పాడైపోయిన టైర్లు,పూల కుండీలు, కొబ్బరిబోండాలలో నీళ్లు నిలిచి దోమలు వృద్ధి చెందుతాయి కాబ్బటి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ నీటిని తొలగించాలని, వాటర్ ట్యాంక్ లు తరుచుగా శుభ్రం చేసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమం లో జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి ఇంచార్జ్ వెంకట్ రెడ్డి, బాగ్ అంబర్ పేట్ డివిజన్ బిజెపి అధ్యక్షులు చుక్క జగన్, ప్రధాన కార్యదర్శి జమ్మిచట్టి బాలరాజు, బిజెపి నాయకులు దత్తు ముదిరాజ్, మిర్యాల శ్రీనివాస్, ఎడెల్లి భాస్కర్, బాలకృష్ణ గౌడ్,  విజయ్ కుమార్, మహమ్మద్ షరీఫ్, శ్రీనివాస్, రమేష్ ఎంటమాలాజీ ఏఈ అంబిక ఎంటమాలజీ ఇ.ఎఫ్.ఏ పి.రాఘవేంద్ర, ఎస్.ఎఫ్.ఏ ఆంజనేయులు, ఏంటోమలజీ బృందం బి. స్వామి, శివ శంకర్, ప్రవీణ్ కుమార్, బాబు రావు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

పన్ను చెల్లింపుదారులను మోసం చేసిన నిర్మల

Satyam NEWS

ఎటాక్: కాకినాడలో మహిళా జర్నలిస్టుపై దాడి

Satyam NEWS

నదీ జలాలపై శాస్త్రీయ పరిష్కారం అవసరం

Satyam NEWS

Leave a Comment