34.7 C
Hyderabad
May 5, 2024 00: 44 AM
Slider ముఖ్యంశాలు

వై యస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రను విజయవంతం చేయండి

#yssharmila

వైయస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి చేవెళ్ల నుండి  చేవెళ్ల వరకు 400 రోజులు నాలుగు వేల కిలోమీటర్లు చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా 1వ,తేది శుక్రవారం సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి దగ్గర హుజుర్ నగర్ నియోజకవర్గం లోకి అడుగుపెడుతున్న సందర్భంగా గురువారం సూర్యాపేట నియోజకవర్గంలో మండల అధ్యక్షులు,నాయకులతో షర్మిల కు ఘనస్వాగతం ఏర్పాట్లపై చర్చించారు.

ఈ సందర్భంగా హుజుర్ నగర్ వైయస్సార్ పార్టీ నియోజకవర్గ కో- ఆర్డినేటర్ ఆదెర్ల శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రాజన్న బిడ్డ పాదయాత్ర కోసం ఘనస్వాగతం పలకడానికి నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎందరో వీరుల ప్రాణ త్యాగాలతో కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ ను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని ఎన్నో రకాల మోసపూరిత హామీలను ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని,ఏడేండ్ల టిఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల మయం అయినదని,ప్రశ్నించే ప్రతిపక్షాలు టిఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తు ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.

ఈ సమయంలో ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయురాలు వైయస్ షర్మిల తెలంగాణలో ప్రజల ఇబ్బందులను తెలుసుకోవడానికి ప్రతి గడపను పలకరిస్తూ నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్ల ప్రజా ప్రస్థాన పాద యాత్రలో వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు,వైయస్ షర్మిల అభిమానులు,వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు,నాయకులు,అన్ని వర్గాల ప్రజలు,మహిళలు,మేధావులు,కవులు, కళాకారులు,ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు, యువతీ,యువకులు,విద్యార్థిని, విద్యార్థులు,నిరుద్యోగులు,అన్ని కార్మిక సంఘాల రైతులు,రైతు కూలీలు పాల్గొని ప్రజా ప్రస్థానం పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో హుజుర్ నగర్ మండల అధ్యక్షుడు శాసనాల అంజనేయులు,హుజుర్ నగర్ పట్టణ అధ్యక్షుడు కంచర్ల అరవింద్ రెడ్డి, మేళ్లచెర్వు మండల అధ్యక్షుడు శాగంరెడ్డి కోటిరెడ్డి,పాలకీడు మండల అధ్యక్షుడు కసిరెడ్డి జనార్దన్ రెడ్డి,నేరేడుచర్ల మండల అధ్యక్షుడు తిప్పన గోవర్ధన్ రెడ్డి,గరిడేపల్లి మండల అధ్యక్షుడు చందా సైదిరెడ్డి, చింతలపాలెం మండల అధ్యక్షుడు దొర్సల క్రిష్ణారెడ్డి,మఠంపల్లి మండలం అధ్యక్షుడు సామెల్ జాన్,హుజుర్ నగర్ పాదయాత్ర అబ్జర్వర్లు నాడెం శాంతి కుమార్, దొండపాటి రాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

అసమర్థ నాయకత్వంతో అప్పుల కుప్పగా మారిన తెలంగాణ

Satyam NEWS

సోమవారం నుంచి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు

Satyam NEWS

చంద్రబాబు అధికారంలో ఉంటే ‘చంద్రన్న క్రిస్మస్ కానుక’ అందేది

Satyam NEWS

Leave a Comment