26.7 C
Hyderabad
May 3, 2024 08: 33 AM
Slider

ఇంటింటి కుళాయిల నిర్మాణం భేష్‌: జాతీయ జ‌ల‌జీవ‌న్ మిష‌న్ డైరెక్ట‌ర్

#jalashakti

జలజీవన్ మిషన్ డైరెక్టర్ ప్రదీప్ సింగ్ విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఈ మేరకు జిల్లాలో ప్ర‌జ‌ల‌కు త్రాగునీటిని అందించేందుకు చేప‌ట్టిన‌ ఇంటింటి కొళాయిల నిర్మాణ ప‌నుల‌ను, జాతీయ జ‌ల‌జీవ‌న్ మిష‌న్ డైరెక్ట‌ర్ ప్ర‌దీప్‌సింగ్ అభినందించారు.

ఆయ‌న జిల్లాలో ప‌ర్య‌టించి, ప‌లుచోట్ల జ‌రుగుతున్న జ‌ల‌జీవ‌న్ మిష‌న్ ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఈ మేరకు ఇన్‌ఫ్రాస్ట‌క్చ‌ర్ స్పెష‌లిస్ట్ అబ్సార్ ఖాన్‌తో క‌లిసి, విజ‌య‌న‌గ‌రం మండ‌లంలోని మ‌లిచ‌ర్ల‌, జొన్న‌వ‌ల‌స‌, కొత్త‌కాపుపేట‌, బ‌డుకొండ‌పేట‌, అంబ‌టివ‌ల‌స త‌దిత‌ర గ్రామాల్లో ప‌ర్య‌టించి, జెజెఎం ప‌నుల‌ను స్వ‌యంగా ప‌రిశీలించారు. త్రాగునీటి స‌ర‌ఫ‌రాపై ఆయా గ్రామాల ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు.

రోజుకు ఎంత‌మేర‌కు నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్న‌దీ, సుర‌క్షిత నీరు స‌ర‌ఫ‌రా అవుతుందా లేదా అని ప్ర‌జ‌ల‌ను ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా గ్రామాల్లోని నీరు, పారిశుధ్య క‌మిటీల‌తో స‌మావేశాలు నిర్వ‌హించారు. ప్ర‌జ‌లంద‌రికీ సుర‌క్షిత త్రాగునీటిని అందించేందుకు చేప‌ట్టిన ఈ ప‌నుల‌న్నీ భేషుగ్గా ఉన్నాయ‌ని అభినందించారు.

ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆర్‌డ‌బ్ల్యూఎస్ సూప‌రింటిండెంట్ ఇంజ‌నీర్ కెవి శివానంద‌కుమార్‌, ఇఇ విద్యాసుంద‌ర‌రాజ‌న్‌, టిపిఐ ప్రాజెక్టు మేనేజ‌ర్ పి.వెంక‌ట‌రావు, డిఇఇ సునీత‌, కోటేశ్వ‌ర్రావు, జెఇ భ‌వాని, థ‌ర్డ్ పార్టీ క‌న్స‌ల్టెంట్ భ‌గ‌వాన్‌, స్వ‌చ్ఛ‌భార‌త్ కోఆర్డినేట‌ర్ పి.ర‌వి, డిడ‌బ్ల్యూఎస్‌సి క‌న్స‌ల్టెంట్లు సుధాక‌ర్‌, ర‌మేష్‌, ఆయా గ్రామాల స‌ర్పంచ్లు, పంచాయితీ కార్య‌ద‌ర్శులు, విడ‌బ్ల్యూఎస్‌సి స‌భ్యులు, ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Related posts

నెల్లూరు జిల్లాలో కాకరేగుతున్న రాజకీయాలు

Satyam NEWS

ఈ నెల 11న ఉమ్మడి వరంగల్ జిల్లాలో లోక్ అదాలత్

Satyam NEWS

రెడ్ ఎలర్ట్: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment