28.7 C
Hyderabad
April 26, 2024 10: 02 AM
Slider హైదరాబాద్

నమూనా పీఎంఏవై -జి గృహాన్ని ప్రారంభించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి

#pmayg

రాజేంద్రనగర్ లో ఉన్న జాతీయ గ్రామీణాభివృద్ధి,పంచాయతీ రాజ్ సంస్థ (ఎన్ఐఆర్డీ అండ్ పీఆర్) లోని  రూరల్ టెక్నాలజీ పార్క్ (ఆర్ టీ పి )లో నిర్మించిన నమూనా పీఎంఏవై -జి గృహాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గిరిరాజ్ సింగ్ అందరికీ అందుబాటులో విధంగా తక్కువ ఖర్చుతో పర్యావరణహిత గృహాలను నిర్మించడానికి అందుబాటులో ఉన్న సాంకేతికతను రూరల్ టెక్నాలజీ పార్క్ (ఆర్ టీ పి )లో నిర్మించిన నమూనా పీఎంఏవై -జి గృహం ప్రదర్శిస్తుందని అన్నారు.

గృహ నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానంతో   పీఎంఏవై -జి పథకం కింద గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని మంత్రి వివరించారు. అందరికీ గృహ వసతి కల్పించాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ  ( పీఎంఏవై -జి) కింద గ్రామీణ గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించిందని మంత్రి తెలిపారు.

మోడల్ హౌస్ లో కల్పించిన వివిధ సౌకర్యాలు, నిర్మాణంలో ఉపయోగించిన నిర్మాణ సాంకేతిక అంశాలు, నాణ్యతతో రాజీ పడకుండా పక్కా గృహ ప్రమాణాలతో తక్కువ ఖర్చుతో నిర్మాణం పూర్తి చేయడానికి గల అవకాశాలను గిరిరాజ్ సింగ్  వివరించారు. గృహ అవసరాలు,వంట కోసం అవసరమైన ఇంధనాన్ని సౌరశక్తి ద్వారా సరఫరా చేసేందుకు ఇంటి పై కప్పుపై నెట్ మీటరింగ్ సౌకర్యంతో ఆన్ గ్రిడ్  2 కేడబ్ల్యు సౌర యూనిట్ ను నెలకొల్పడం జరిగిందని మంత్రి వివరించారు. 

ఆర్ టీ పి   కంప్రెస్డ్ మడ్ బ్లాక్ ప్రొడక్షన్ యూనిట్‌ని సందర్శించిన కేంద్ర మంత్రి  ఇందులో ఉన్న ప్రక్రియ, నాణ్యత మరియు ఉత్పత్తి వ్యయానికి సంబంధించిన వివరాలను సిబ్బంది నుంచి అడిగి తెలుసుకున్నారు.  తక్కువ ఖర్చుతో  పర్యావరణ అనుకూలమైన    ఇటుకలను తయారు చేయడంలో ఎక్కువ ఫ్లై-యాష్‌ని ఉపయోగించాలని మంత్రి సూచించారు.

సామాన్యులకు అందుబాటులో ఉండేలా విధంగా ఖర్చు  తగ్గించడానికి మట్టితో వివిధ నిష్పత్తులలో ఫ్లై-యాష్ కలపడానికి నూతన విధానానికి రూపకల్పన చేయాలని   జాతీయ గ్రామీణాభివృద్ధి,పంచాయతీ రాజ్ సంస్థ  అధికారులకు మంత్రి సూచించారు.

జాతీయ గ్రామీణాభివృద్ధి,పంచాయతీ రాజ్ సంస్థలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలను సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి.నాగేంద్ర కుమార్ వివరించారు. దేశంలో పంచాయతీల సామర్ధ్య పెంపుదల కోసం జాతీయ గ్రామీణాభివృద్ధి,పంచాయతీ రాజ్ సంస్థ సహకారం అందిస్తున్నదని తెలిపారు.

342 చదరపు అడుగుల విస్తీర్ణంలో ( హాల్,బెడ్ రూమ్, వంటగది, మరుగుదొడ్డి, బాత్ రూంతో కలిపి) సింగల్ బెడ్ రూం మోడల్ హౌస్ నిర్మాణం జరిగింది. గృహం పునాది కోసం రాండమ్ రబుల్ స్టోన్ మేసన్రీ, గోడలను నిర్మించేందుకు  ఫ్లై-యాష్ ఇటుకలతో రాట్ -ట్రాప్ సాంకేతికతను ఉపయోగించారు. ఈ సందర్భంగా  మంత్రి సమక్షంలో  జాతీయ గ్రామీణాభివృద్ధి,పంచాయతీ రాజ్ సంస్థ , నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, ఎంఎస్ఎంఈ  ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. 

ఎంఎస్ఎంఈ   రంగంలోని నిరుద్యోగ యువత, స్వయం సహాయక బృందాల సభ్యులకు  నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను అందించడం మరియు ఆవిష్కరణలు మరియు రూపకల్పనకు సహకారం అందించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది.

Related posts

పెళ్లికి ఇవ్వాల్సిన చెక్కులు పిల్లలు పుట్టినంక ఇస్తురు

Satyam NEWS

బాసర ఆలయాన్ని సందర్శించిన కమిషనర్

Satyam NEWS

నేటి వరకూ 38.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

Bhavani

Leave a Comment