30.7 C
Hyderabad
April 29, 2024 03: 37 AM
Slider ఖమ్మం

ఏజెన్సీ ప్రాంత వాసులకు అండగా పోలీసులు

#spktdm

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  పినపాక మండలానికి చెందిన పిట్టతోగు గుత్తికోయ గ్రామంలో ఏర్పాటు చేసిన 05 సోలార్ విద్యుద్దీపాలను(వీది లైట్లు) జిల్లా ఎస్పీ డా.వినీత్ ప్రారంభించారు. అదే విధంగా గ్రామంలోని 22 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రెండు చొప్పున దోమ తెరలను అందజేసారు.ఇందులో భాగంగానే తిర్లాపురం, నీలాద్రిపేట, నెమలిగూడెం, పడిగాపురం గుత్తికోయ గ్రామాలకు కూడా మొత్తం 22 సోలార్ విద్యుద్దీపాలను ఏర్పాటు చేయడం జరిగింది. తరువాత అక్కడ ఉన్న యువకులకు వాలీ బాల్ కిట్ ను అందజేసి వారితో కలిసి సరదాగా ఆటలో పాల్గోన్నారు. అనంతరం ఎస్పీ జిల్లా గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్తీస్ఘడ్ రాష్ట్రం నుండి వలస వచ్చి జీవనం సాగిస్తున్న గుత్తికోయ ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని,వారి సంక్షేమం,అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు.కరెంట్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న గుత్తికోయ గ్రామాల్లో ముందుగా సోలార్ వీది దీపాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలో సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి మారుమూల గ్రామాలలో కనీస సదుపాయాలను ఏర్పాటు చేయడానికి తమ వంతు బాధ్యతగా పనిచేస్తున్నామని తెలియజేశారు.గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని కోరారు.మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులుగా మారి,వారి స్వప్రయోజనాల కోసం అమాయకులైన గుత్తికోయలను ఉపయోగించుకుంటున్నారని అన్నారు.ఎలాంటి ఆపదలు తలెత్తినా పోలీసు వారి సహాయ సహకారాలు పొందాలని తెలిపారు.తమ గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తున్న పోలీసువారికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.నిరంతరం గుత్తికోయ గ్రామాలను సందర్శిస్తూ,వారికి కనీస సౌకర్యాలను సమకూర్చటానికి కృషి చేస్తున్న మణుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు,ఏడూళ్ల బయ్యారం సిఐ రాజగోపాల్,ఎస్సై నాగుల్ మీరా మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్,మణుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు,సిఐ రాజగోపాల్,ఎస్సై నాగుల్ మీరా మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మ్యూజిక్ సిట్టింగ్స్ లో రాజు బొనగాని బహు భాషా చిత్రం ఎంగేజ్మెంట్

Satyam NEWS

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కొరడా

Satyam NEWS

నాగోల్‌ మెట్రోస్టేషన్‌ పరిధి లోని డంపింగ్‌ యార్డు తరలించాలి

Satyam NEWS

Leave a Comment