40.2 C
Hyderabad
April 29, 2024 16: 06 PM
Slider విశాఖపట్నం

డాక్టర్ సుధాకర్ దళితుడు కాబట్టే ఇలా అవమానించారు

#Dr.Sudhakar Hospital

కసబ్ లాంటివాళ్లను అరెస్టు చేసి తీసుకెళ్లే విధంగా డాక్టర్ సుధాకర్ ను రెండు చేతులు వెనక్కి కట్టి, లాఠీతో కొట్టి తీసుకువెళ్లడం అమానుషమని తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత అన్నారు. డాక్టర్ సుధాకర్ దళితుడు కాబట్టి కక్షగట్టి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు.

నేడు ఆమె డాక్టర్ సుధాకర్ ను మాసిక వైద్య శాలలో పరామర్శించారు. ఇంతకుముందు నరసరావుపేటలో రెడ్డి కులానికి చెందిన డాక్టర్ కూడా ఇలాగే మాట్లాడితే ఎలాంటి చర్యలు తీసుకోలేదని అనిత విమర్శించారు. పోలీసులు తీరు బాగోలేదని ఆమె విమర్శించారు. మాస్కులు అడిగినంత మాత్రానా సస్పెండ్ చేస్తారా? ఈ విధంగా ఎంత మందిని ప్రభుత్వం సస్సెండ్ చేస్తుందని అనిత ప్రశ్నించారు.

ఇది ప్రభుత్వ వైఫల్యమని, డాక్టర్ సుధాకర్ ఆ విధంగా ఉండడానికి కారణం సీఎం జగన్ అని, ఆయనపై కేసులు పెట్టాలని అనిత డిమాండ్ చేశారు. డాక్టర్‌కు తమ మద్దతు ఉంటుందని అనిత స్పష్టం చేశారు. డాక్టర్ సుధాకర్‌ను పిచ్చాసుపత్రికి తరలించడం దారుణమన్నారు. డాక్టర్ సుధాకర్ 26 ఏళ్ల సర్వీసులో ఎక్కడ చిన్న రిమార్క్ కూడా లేదని ఆమె అన్నారు.

Related posts

కేంద్ర ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టిన అభ్యర్ధి భార్య

Satyam NEWS

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలి

Satyam NEWS

టీవీ9 రవిప్రకాష్ పై మరో కొత్త కేసు నమోదు

Satyam NEWS

Leave a Comment