33.7 C
Hyderabad
April 29, 2024 02: 23 AM
Slider గుంటూరు

పల్నాడు జిల్లా ఏర్పాటు ఆహ్వానిస్తూ ఎమ్మెల్యే పాదయాత్ర

#narasaraopetmla

పల్నాడు జిల్లా ఏర్పాటు ఆహ్వానిస్తూ గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాదయాత్ర తలపెట్టారు. ఈ పాదయాత్రకు నరసరావుపేట రోటరీ క్లబ్ సభ్యులు సంఘీభావం వ్యక్తం చేశారు.

నరసరావుపేట ప్రధాన కేంద్రంగా పల్నాడు జిల్లాగా ఏర్పడిన సందర్భంగా నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని నరసరావుపేట శాసన సభ్యులు రొటేరియన్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శనివారం నరసరావుపేట నుండి కోటప్పకొండ వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి లకు  నరసరావుపేట రోటరీ క్లబ్ సభ్యులు సంఘీభావం తెలిపి పూలమాలలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు మెళ్లచేరువు సుమిత్ర కుమార్, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రొటేరియన్ మిట్టపల్లి రమేష్, పాస్ట్ గవర్నర్ కె.పి. రంగారావు, పబ్లిక్ ఇమేజ్ డైరెక్టర్ ఎస్.కె.జిలాని మాలిక్, పాస్ట్ ప్రెసిడెంట్ రాయల శ్రీనివాసరావు, పాశం కృష్ణారావు, సభ్యులు డి.టి.యస్.బాబీ, డాక్టర్ రాజనంద రెడ్డి, కపీలవాయి రాజేంద్రప్రసాద్, పోటు అచ్యుత్, వైసీపీ నాయకులు ఖాజావలి మాస్టర్, మాజీ కౌన్సిలర్ మస్తాన్ వలి, సత్తార్, కారుమంచి మిరవలి, తదితర రోటరీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నరసరావుపేట ప్రధాన కేంద్రంగా పల్నాడు జిల్లాగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని,ఎమ్మెల్యే గోపిరెడ్డి ని,మిగతా ప్రజాప్రతినిధులను అభినందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలలో విశిష్ట స్థానాన్ని పొందుతున్న నరసరావుపేట పార్లమెంట్ లోని నరసరావుపేట నియోజకవర్గం. ఒక సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రాంతం అని అన్ని వసతులు ఉన్న నరసరావుపేట కు జిల్లా హెడ్ క్వార్టర్స్ గా ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు.

Related posts

రాజకీయ పార్టీలు మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టవద్దు

Satyam NEWS

విజయనగరం లో ఎమ్మెల్యే కోలగట్ల కుమార్తె గెలుపు

Satyam NEWS

బీజేవైఎం ఆధ్వ‌ర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ ద‌హ‌నం

Sub Editor

Leave a Comment