38.2 C
Hyderabad
May 2, 2024 20: 01 PM
Slider ఆదిలాబాద్

చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు

#smatasabrwalias

జిల్లాలోని రైతులకు పంట సాగు చేసుకునేందుకు ప్రాజెక్టుల క్రింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే విధంగా సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. సోమవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ- ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి అంకిత్, జిల్లా అదనపు కలెక్టర్లు వరుణ్ రెడ్డి, రాజేశం, అదనపు ఎస్. పి. (అడ్మిన్) అచ్చేశ్వరరావు , జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల శాసనసభ్యులు ఆత్రం సక్కు, కోనేరు కోనప్పలతో కలిసి జిల్లాలోని చిన్న వాంకిడి గ్రామ సమీపంలో గండి పడిన కాలువను పరిశీలించిన అనంతరం వట్టివాగు, అడ ప్రాజెక్టుల క్రింద ఉన్న కాలువలను తనిఖీ చేశారు.

ప్రాజెక్టు కింది కాల్వపనుల్లో జాప్యం వద్దు

ముఖ్యమంత్రి కార్యదర్శి మాట్లాడుతూ సాగు నీటి కోసం రైతులు ఇబ్బంది పడకుండా ప్రాజెక్టు కింద కాలువల పనులు ఎలాంటి జాప్యం లేకుండా నిర్వహించాలని తెలిపారు. అడ ప్రాజెక్టు 10 టి. ఎమ్. సి. లు, వట్టివాగు ప్రాజెక్టు 2.89 ఎఫ్. టి. సి. నీటి సామర్థ్యం కలిగి ఉన్నాయని, ఈ ప్రాజెక్టుల కింద ఖరీఫ్ సీజన్ కు గాను సాగునీరు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరై మాట్లాడారు.

ప్రాజెక్టులకు అనుసంధానమైన కాలువలలో ఎలాంటి పూడిక లేకుండా తొలగింపు పనులు చేపట్టి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని చెరువులు, కుంటల క్రింద తూముల ద్వారా సాగునీరు అందించేందుకు సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ రూపొందించి సకాలంలో నీటిని అందించాలని సూచించారు.

కాలువలు, తూములలో అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. పనుల నిర్వహణలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని, గుత్తేదారులతో మాట్లాడి డిసెంబర్ నెలాఖరు వరకు పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని అభివృద్ధి పనులకు అనుగుణంగా భూ సేకరణ కార్యక్రమాన్ని 95 శాతం పూర్తి చేయడం సంతోషంగా ఉందని, 100 శాతం పూర్తి చేసే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు.

మిషన్ భగీరథ పథకంలో భాగంగా ప్రతి ఇంటికీ శుద్ధజలం అందించే విధంగా సంబంధిత అధికారులు పనులు వేగవంతం చేయాలని, వంతెన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో రక్తహీనత లోపం లేకుండా పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహారం, చిరుధాన్యాల వినియోగంపై ప్రజలలో చైతన్యం తీసుకువచ్చి జాతీయ స్థాయిలో  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ.ఎమ్.సి. చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్, రాజస్వ మండల అధికారి దత్తు, జెడ్. పి. టి. సి. ఫోరం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వరరావు, ఎమ్. పి. పి. మల్లికార్జున్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇండస్ట్రీయల్ హెల్త్ క్లినిక్ ద్వారా ఖాయిలా పరిశ్రమలకు ఊతం

Satyam NEWS

సాయంత్రం ఏడు గంటలకే తుది జాబితా

Satyam NEWS

నిషేధిత గుట్కా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ ఖమ్మం పోలీసులు

Satyam NEWS

Leave a Comment