38.7 C
Hyderabad
May 7, 2024 15: 17 PM
Slider ఖమ్మం

పనులన్ని త్వరితగతిన పూర్తిచేయాలి

#Collector V.P

ప్రభుత్వ వైద్య కళాశాల మిగులు పనులన్ని త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ ప్రభుత్వ కళాశాల సందర్శించి, పనుల పురోగతిని పరిశీలించారు.లెక్చర్ హాల్ కు సంబంధించి ఏసీ, ఫర్నీచర్ ఏర్పాట్లను చేయాలన్నారు. ఆర్ అండ్ బి శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న బాలికల, పాత జిల్లా వైద్య ఆరోగ్యాధికారి కార్యాలయం మొదటి అంతస్థులో ఏర్పాటుచేస్తున్న బాలుర హాస్టళ్లను కలెక్టర్ పరిశీలించారు. డైనింగ్ హాల్, కిచెన్ రూమ్, డార్మెటరీ లను పరిశీలించారు.

డోర్, కిటికీలకు వైర్ మెష్ లు పరిశీలించారు. టాయిలెట్లకు కనెక్షన్లు ఇచ్చి, పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయాలన్నారు. హాస్టళ్ల లోపల, ఏర్పాటుచేసిన ఫర్నిచర్ శుభ్రపరచాలని ఆయన అన్నారు. హాస్టల్ సౌకర్యం కొరకు 38 మంది బాలికలు, 22 మంది బాలురు ఇప్పటివరకు నమోదు చేసుకున్నట్లు, మిగతా వారిలో స్థానికేతరులను సంప్రదించి, హాస్టల్ లో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

పెయింటింగ్ రెండో కోట్, మిగులు పనులన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, కళాశాల ప్రారంభ దినాన మంచి వాతావరణం స్పూరించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. అనంతరం కలెక్టర్ జిల్లా ప్రధాన ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేశారు.

ఆసుపత్రిలోని క్యాజువాలిటి, మేల్ మెడికల్ వార్డులను సందర్శించి ఎన్ని కేసులు ఈరోజు వచ్చినవి, ఎన్ని కేసులు డిశ్చార్జ్ చేసినది, ఏ ఏ వ్యాధులకు సంబంధించిన కేసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడారు.

ఎప్పుడు అడ్మిట్ అయింది, డాక్టర్లు పరీక్షిస్తున్నది, సేవలు అందిస్తున్నది, భోజనం ఇస్తున్నది వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్షణాలున్న వారికి డెంగ్యూ పరీక్ష చేయాలని, ప్రధాన ఆసుపత్రిలో రోజు 100 నుండి 150 పరీక్షలు చేయాలని ఆయన అన్నారు.

డ్యూటీ వైద్య సిబ్బంది విధులు ఖచ్చితంగా నిర్వర్తించాలని, అత్యవసర సమయాల్లో రేడియాలజీ టెక్నీషియన్లను పిలిపించాలని, రోగులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. రాజేశ్వరరావు, ఆర్ఎంఓ శ్రీనివాసరావు, డిఎంఓ శ్రీనివాస్, డిఇ శ్రీనివాస్, వైద్య సిబ్బంది తదితరులు వున్నార

Related posts

జోషిమఠ్ లో కూల్చివేతలపై జనం ఆగ్రహం

Bhavani

మునుగోడు లో అభ్యర్డులకు గుర్తుల కేటాయింపు

Satyam NEWS

ఆన్ డ్యూటీ:బస్సు లోనే గుండె పోటుతో కండక్టర్ మృతి

Satyam NEWS

Leave a Comment