40.2 C
Hyderabad
May 2, 2024 16: 59 PM
Slider ఖమ్మం

త్రాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

#AYUSH Health

త్రాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నగర పాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో నగర పాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి, ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్, త్రాగునీటి సరఫరా, హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మరమ్మత్తులు, ఆయుష్ హెల్త్ వెల్ నెస్ కేంద్రాల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్రాగునీటి సరఫరాకు నగరంలో రూ. 229.95 కోట్లతో త్రాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 18 ఇఎల్ఎస్ఆర్ ల నిర్మాణం చేపట్టగా, 15 నిర్మాణాలు పూర్తి అయినట్లు, మిగతా 3 ల పనులు ఈ నెల 20 లోగా పూర్తి కానున్నట్లు ఆయన అన్నారు. 685 కిలోమీటర్ల మేర పైప్ పనులు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. త్రాగునీటి సరఫరాకు ఏ ప్రాంతంలో సమస్యలు రాకుండా చూడాలన్నారు.

ఇఎల్ఎస్ఆర్ ల నిర్మాణం పూర్తయిన వెంటనే అప్పగించాలని, కమీషనింగ్, పైప్ లైన్ పనులు వెంట వెంటనే పూర్తి చేయాలని ఆయన తెలిపారు. జిల్లాలో ఖమ్మం డివిజన్ పరిధిలో 35, సత్తుపల్లి డివిజన్ పరిధిలో 15 మొత్తంగా 50 హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణానికి, ఒక్కో సబ్ సెంటర్ కి రూ. 20 లక్షల చొప్పున మంజూరు రాగా, ఇప్పటివరకు 47 నిర్మాణాలు గ్రౌండింగ్ అయి, పనులు వివిధ దశల్లో ఉన్నట్లు ఆయన అన్నారు. మిగతా 3 సబ్ సెంటర్ల పనులు వెంటనే ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

జిల్లాలో 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మరమ్మత్తులు, రెన్నోవేషన్ కొరకు రూ. 396.50 లక్షల అంచనాలతో పనులు చేపట్టగా, 4 కేంద్రాల పనులు పూర్తయినట్లు, 8 కేంద్రాల పనులు పురోగతిలో ఉన్నట్లు ఆయన అన్నారు. జిల్లాలో రూ. 42 లక్షలతో 7 ఆయుష్ హెల్త్ వెల్ నెస్ కేంద్రాల ఏర్పాటుకుగాను, 5 చోట్ల పనులు పూర్తయినట్లు, 2 చోట్ల చివరి దశలో ఉన్నట్లు ఆయన తెలిపారు.

అధికారులు రోజువారి పనుల పురోగతిపై పర్యవేక్షణ చేయాలని, మెన్, మెటీరియల్ పెంచి, పనుల్లో వేగం పెంచాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. బి. మాలతి, పబ్లిక్ హెల్త్ ఎస్ఇ రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, పీఆర్ ఇఇ లు కెవికె. శ్రీనివాస్, చంద్రమౌళి, మునిసిపల్ డిఇ లు రంగారావు, స్వరూపారాణి, నవ్యజ్యోతి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బ్యాంకులు పారిశ్రామిక రంగానికి అధిక రుణాలు అందించాలి

Satyam NEWS

మైలార్డ్: వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించండి

Satyam NEWS

25,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

Sub Editor 2

Leave a Comment