26.7 C
Hyderabad
May 3, 2024 09: 20 AM
Slider ముఖ్యంశాలు

ప్రతినిత్యం అప్రమత్తంగా ఉండాలి.. పువ్వాడ

#Minister Puvwada Ajay Kumar

భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలిoచి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ప్రకృతి వైపరిత్యాలు అడ్డుకోలేం కానీ నష్టాన్ని నివారించగలం అంటూ జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయి అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ప్రాణనష్టం జరగకుండా పరిస్థితులు చక్కదిద్దాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ను ఆదేశించారు.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు ఒక పక్క, వివిధ ప్రాజెక్ట్స్ గేట్స్ ఎత్తివేయడం మారో పక్క.. తద్వారా గోదావరికి వరద పోటెత్తిందని మంత్రి పువ్వాడ అన్నారు.రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రిసిటీ, పంచాయితీ రాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, హెల్త్ పలు ప్రభుత్వ శాఖలు అధికారులను, క్షేత్ర స్థాయిలో సిబ్బంది నిత్యం అప్రమత్తం ఉండాలని సూచించారు.

అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని మంత్రి పువ్వాడ విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు, జాలర్లు ఎవరూ చేపల వేటకు వెళ్ళొద్దని కోరారు. అకారణంగా ప్రజలను ఎవరిని బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ వినీత్ ను ఆదేశించారు. పోలీస్, ఇరిగేషన్ అధికారులందరు ముంపు ప్రాంతాల్లోనే ఉండి పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

భద్రాచలంలో ప్రస్తుతం కొనసాగుతున్న పునరావాస కేంద్రాలను మెరుగు పరచి మరికొన్ని పునరావాస కేంద్రాలు సిద్దం చేయాలని కలెక్టర్ కు సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్దంగా ఉండాలన్నారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం అస్తి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని, అందుకు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు .

Related posts

మహారాజ ప్రభుత్వ హాస్పిటల్ పేరు మార్పుపై టీడీపీ ఆందోళన

Satyam NEWS

ప్రజా ప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లాలి: ఎంపీ ఆదాల పిలుపు

Satyam NEWS

బెటాలియ‌న్ కమాండెంట్ విక్రాంత్ పాటిల్ కు అభినందనల వెల్లువ

Satyam NEWS

Leave a Comment