తెనాలిబాబు, లింగమనేని బాబులు కలసి మిమ్మల్ని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి ప్యాకేజిలు మాట్లాడిన సంగతి అందరికి తెలుసు. చంద్రబాబు ఎవరికి చెబితే వారికి టిక్కెట్లు ఇచ్చి మీ పార్టీని మీరే సర్వనాశనం చేసుకున్నారు. ఎవరో ఆయిల్ కొడితే మీ బండి నడుపు కొంటున్నారు. మీ ఆయిలే మీరు కొట్టుంచుకుని బండినడుపుకుంటే ఎంతబాగుంటుంది. దాని కిక్కే వేరప్ప – అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎద్దేవా చేశారు వైసిపి నాయకుడు అంబటి రాంబాబు. పదే పదే పెళ్లాలు గురించి మాట్లాడుతున్నారు. మీరు కూడా చేసుకోండి అంటున్నారు. అయ్యా మీరు తప్పుచేశారని చెబితే, మీరు కూడా తప్పులు చేయండి అని మాట్లాడుతున్నారు. ఇది మీ మానసిక పరిస్ధితి అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు. జగన్ 16 నెలలు జైలులో ఉన్నారు అంటూ మాట్లాడిన మాటలు వ్యక్తిగతమా. పాలసీలపై మాట్లాడటమా. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్ కల్యాణ్ కు లేదు అని ఆయన అన్నారు. మీకు ఎక్కడినుంచి ప్యాకేజిలు వస్తున్నాయి. వాటి గురించి ఆసక్తితో మీరు ఎగేసుకుని మాట్లాడుతున్నారు. మీ కార్యకర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో పిలిచి అడగండి. మీ చుట్టూ ఉన్న నేతలను మీ గురించి ఏమనుకుంటున్నారో అడగండి అని ఆయన హితవు పలికారు.
previous post