37.2 C
Hyderabad
May 2, 2024 12: 17 PM
Slider ముఖ్యంశాలు

ముత్యoధార లో చిక్కుకున్న వారు సేఫ్

#Mutyam Dara waterfall

ములుగు జిల్లా నూగురు వెంక‌ట‌పురం మండ‌లం వీర‌భ‌ద్రరం గ్రామ‌ అట‌వీ ప్రాంతంలో ఉన్న ముత్యం దారా జ‌ల‌పాతాన్ని చూడడానికి 80 మంది ప‌ర్యాటకులు వెళ్లారు. తిరిగి వ‌స్తున్న స‌మ‌యంలో భారీ వ‌ర్షం కార‌ణంగా మార్గ మ‌ధ్యలో గ‌ల మామిడి గండి వాగు పోంగి పోర్లుతుండ‌డంతో అడ‌విలో చిక్కుకుపోయారు.

కాగా చిక్కుకుపోయిన వారి కోసం పోలీసులు, జిల్లా డిజాస్టార్ రెస్పాన్స్ ఫోర్స్‌, ఏన్డీఆర్ఏఫ్ సిబ్బంది గాలింపు చ‌ర్యలు చేప‌ట్టారు.అడ‌వి మ‌ధ్యలో చిక్కుకు పోయిన వారిలో ఒక వ్యక్తి ఫోన్ ద్వారా స‌మాచారాన్ని 100 నెంబ‌ర్‌కి ఫోన్ చేసి తెలిపారు. విష‌యం తెలుసుకున్న జిల్లా ఏస్పీ హూటాహూటిన వెంక‌టాపురం సీఐ, ఏస్సై పోలీసు సిబ్బంది, ఏన్‌డిఆర్ఏఫ్ సిబ్బంది గాలింపు చ‌ర్యలు చేప‌ట్టారు. రాత్రి స‌మయంలో ఘ‌ట‌న స్తలానికి ములుగు జిల్లా ఏస్పీ గౌష్ అలాం, ఏటూరునాగారం ఏఏస్పీ సీరిశేట్టి సంకీర్త్ చేరుకొని గాలింపు చ‌ర్యలు ముమ్మరం చేసారు.

అర్ధరాత్రి స‌మయంలో వారి అచూకీ తెలియ‌గా ఏన్టీఆర్ఏఫ్ బృందం సాయంతో ప‌ర్యాటకుల‌ను ఒడ్డుకు తీసుకు వచ్చారు. ఒడ్డుకు చేరుకున్న వారిలో అనారోగ్యంగా ఉన్న వారికి వెంక‌టాపురం వైద్య సిబ్బంది చికిత్స అందించారు. కాగా జ‌ల‌పాతాన్ని చూడడానికి వెళ్లిన ప‌ర్యాటకులు ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్‌, హ‌న్మకొండ, వరంగ‌ల్‌కు చెందిన‌వారు అని తెలిసింది.

Related posts

మాల మహానాడు మహబూబ్ నగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా పాశం

Satyam NEWS

క్లారిటీ: రైతులందరికీ యధావిధిగా రైతు బంధు

Satyam NEWS

సలాకపురి రాకేష్ కి డాక్టరేట్

Satyam NEWS

Leave a Comment