37.2 C
Hyderabad
May 6, 2024 12: 23 PM
Slider ఆంధ్రప్రదేశ్

భార‌త రాజ్యాంగాన్ని ర‌క్షించుకుందాం

ambedkar 64

మనువాదుల పాలనలో భారత రాజ్యాంగాన్నిరక్షించుకుందామ‌ని బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా దళిత సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 11 గంటలకు స్థానిక అంబేద్కర్ ఆడిటోరియం నుండి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సంద‌ర్భంగా సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి. గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, మాదిగ దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రానా శ్రీనులు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో అన్నదాతలు చేస్తున్నా వీరోచిత పోరాటానికి జేజేలు పలికారు. అన్నదాతల‌ పోరాటంతో మోడీ మనువాద పాలనకు కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు విపరీతంగా పెరుగుతున్ననేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు చైర్మన్, సభ్యులను నియమించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బెలమన రమేష్, గొడగల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు దీర్ఘాసి హరీష్, కమల, సూర్యనారాయణ, మార్స్‌ తిరుమల, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రాకోటి రాంబాబు, వంశధార నిర్వాసితుల సంఘం నాయకులు చింతాడ కృష్ణ, కసింవలస దళిత ఆత్మగౌరవ పోరాట కమిటీ కన్వీనర్ కొంగరాపు మధు, కో కన్వీనర్ డి రాంబాబు, గోసామ్ దళిత ఆత్మగౌరవ పోరాట కమిటీ కో కన్వీనర్ లెంక గోవింద్, సవలపురపు ఆనంద్, పొల్లా రఘు, అలికాన లక్ష్మీనారాయణ, రాజు, కేతుబారికి రామారావు, పాపారావు, రాము, భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా ఏఎస్ఆర్ జన్మదిన వేడుకలు

Satyam NEWS

ఒంటిమిట్ట సీతారాములకు పద్మశాలీయుల పట్టు వస్త్రాలు

Satyam NEWS

గుండె ఆపరేషన్ కి సహాయం చేసిన మనం చారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS

Leave a Comment