38.2 C
Hyderabad
May 3, 2024 19: 14 PM
Slider ప్రత్యేకం

పోలీసు సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు

#APDGP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు పోలీస్ శాఖలో సిబ్బంది  సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. సిబ్బంది, వారి కుటుంబం సభ్యుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడ లేని విధంగా నూతన విధానాలను అమలులోకి తీసుకువచ్చామని ఏపి డిజిపి గౌతం సవాంగ్ అన్నారు. ఈ నూతన సంక్షేమ పాలసీ ఫలాలను పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న కిందిస్థాయి సిబ్బందికి చేరే విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, డీఐజీలు, పోలీసు అధికారుల సంఘం సభ్యులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ప్రజా రక్షణలో అత్యంత కీలకం పోలీసు శాఖ. ఆ శాఖలోని   సిబ్బంది  ఎల్లవేళలా అత్యంత కఠినమైన, క్లిష్టమైన పరిస్థితుల్లో తమ విధులు నిర్వహిస్తుంటారు. సాధారణ విధులకు తోడు ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి పైన  జరిగిన మహా యుద్దంలో 200 మందికి పైగా సిబ్బంది ప్రజా సేవలో వీరమరణం పొందారు.  పోలీసు  సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల  సంక్షేమం పై దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీస్ శాఖలో సంక్షేమ పరంగా క్షేత్ర స్థాయి సిబ్బందికి లబ్ధి పొందే విధంగా నూతన సంక్షేమ పాలసీని  అందుబాటులోకి తీసుకువచ్చారు.

పోలీసుశాఖ లోని అన్ని విభాగాలు జిల్లా కేంద్రాల్లో  ప్రతి శుక్రవారం సిబ్బంది కోసం ప్రత్యేకంగా  పోలీస్ వెల్ఫేర్ డే గా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నూతన పాలసీ లో భాగంగా ఋణాల లబ్ధి , ఋణాల వడ్డీ శాతం తగ్గింపు, ఋణాలు తిరిగి చెల్లించే కాలపరిమితిని  పెంచడంతోపాటు వ్యక్తిగత, వాహనాలు, వివాహం, విద్య, గృహనిర్మాణం, గృహ స్థలాలు, విదేశీ చదువులుపై పొందే ఋణాల పరిమితిని భారీగా పెంచడం, వివిధ బ్యాంక్ లతతో చర్చించిన అనంతరం ప్రస్తుతం ఉన్న వడ్డీ శాతం వివిధ విభాగాల్లో సుమారు 2.5% నుండి 4% శాతాన్ని తగ్గిస్తూ నూతన  పాలసీలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

పోలీసుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి హర్షదాయకం

రాష్ట్ర పోలీసుల సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా భద్రత పధకం క్రింద ఇల్లు కొనుగోలు/నిర్మించు కొనేందుకు కేవలం 5 శాతం వడ్డీకి 40 లక్షల రూపాయలు, ఇంటి స్థలం కొనుగోలుకు 25 లక్షల రూపాయలు ఋణ సదుపాయం కల్పించడం ద్వారా పోలీసు సిబ్బంది వారి కుటుంబాలలో ఆనందాలు వెల్లి విరుస్తున్నాయని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తెలిపింది.

పోలీసు పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం ఎడ్యుకేషన్ లోన్ ను 50 లక్షలకు పెంచడం, భద్రతా పథకంలో కొత్తగా వాహనాలు ( టూ వీలర్ , ఫోర్ వీలర్ ) కొనుగోలు చేసేందుకు రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టడంతో పాటు పోలీస్ సిబ్బంది యోగక్షేమాలు సాధక బాధలు వారి సమస్యలను పరిష్కరించడం కోసం ప్రతి శుక్రవారం పోలీసు సంక్షేమ దివస్ గా ప్రకటించడం ఎంతో ఆనందాయకమని వారన్నారు.

Related posts

కృష్ణానదిలో రోజు రోజుకూ పెరుగుతున్న వరద

Satyam NEWS

చుక్కాయిపల్లి చాకలి మడుగుపై వంతెన నిర్మాణంతో తొలగిన రైతుల వెతలు

Satyam NEWS

రండి సినిమా ధియేటర్లలోనే సినిమా చూద్దాం

Satyam NEWS

Leave a Comment