35.2 C
Hyderabad
April 27, 2024 13: 04 PM
Slider విశాఖపట్నం

“హిందూ” అనేది మతం కాదు…సనాతన భారతదేశ వైదిక వ్యవస్థ…!

#hinduisum

ఆర్.ఎస్.ఎస్..తిలక్ ప్రభాత్ శాఖ వార్షికోత్సవం లో కుటుంబ సంపర్క్ ప్రముఖ్ పరమహంస

ప్రపంచంలో ఇస్లాం, క్రిస్టియన్ మతాలకన్న ఎన్నో వేల సంవత్సరాల క్రితమే “హిందూ” అన్న భారతదేశ సంస్కృతి ఫరిడవిల్లిందని ఆర్.ఎస్.ఎస్ కుటుంబ సంపర్క్ ప్రముఖ్ విశ్రాంతి గ్రామీణ బ్యాంక్ రీజియన్ మేనేజర్ పరమహంస అన్నారు.ఈ మేరకు అంబేవాడేకర్ 132వ జయంతి నేపథ్యంలో విజయనగరం బ్యాంక్ కాలనిలో సంఘ్ తాలూకు తిలక్ ప్రభాత్ శాఖ వార్షికోత్సవం సందర్భంగా కలాం పార్క్ లో జరిగిన శాఖ ముగింపు సందేశం ఇచ్చారు.”హిందూ” అన్నది అసలు మతమే కాదని… అది మన సనాతన భారతీయ సంస్కృతి వారసత్వ సంపద అని పరమహంస అన్నారు.

ప్రస్తుతం యావత్ భారతదేశంలో ఆర్.ఎస్.ఎస్ లో ప్రతీ రోజు  గంటసేపు జరుగుతున్న శాఖ ప్రధాన మని అన్నారు. శాఖ ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, కుటుంబ వ్యవస్థ లు మరింత గా వృధ్ధి చెందుతాయన్నారు.అసలు ఆర్.ఎస్.ఎస్ కు బీజేపీ కి సంబంధమే లేదని… కానీ బీజేపీ లో జాతీయ భావం నింపినది మాత్రం ఆర్.ఎస్.ఎస్ అని స్పష్టం చేశారు. మానవ శరీరంలో ఎన్ని నాడులున్నా ప్రాణం లేనిదే పని చేయలేవని అలాగే ఆర్.ఎస్.ఎస్ శాఖ లేనిదే…దేశంలో ఏ వ్యవస్థ ముందుకెళ్లలేదని….శాఖే అన్నింటికీ మూలమని రోజు లో ఒక గంట…శాఖకు కేటాయించాలని సంఘ్ కుటుంబ సంపర్క్ ప్రముఖ్ పరమహంస ఉద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో శాఖ ముఖ్యశిక్షక్ దేశరాజు అప్పలనరసయ్య, ఆర్.ఎస్.ఎస్ నగర కార్యవాహ నాయుడు, విభాగ్ బౌధ్ధిక్ ప్రముఖ్ తిరుపతి రావు ,శాఖ కార్యవాహ మూర్తి, మురళీధర్, ఏబీఎన్, బీజేపీ కి చెందిన కార్యకర్తలు కాలనీ వాసులు సుమారు 30 మంది వరకు పాల్గొన్నారు. ఉదయం 06.30కు మొదలైన శాఖలో సూర్య నమస్కారాలు, వ్యాయామయోగ్ ,ఆటలు, సంచలనం..చివరగా “నమేస్తే సదా వత్సలే మాతృభూమే” అంటూ సంఘ్ కు ఊపిరి అయినటువంటి ప్రార్ధనతో కార్యక్రమం ముగిసింది.

Related posts

రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలకు రక్షణ కరువైంది

Satyam NEWS

8వ తేదీన హైదరాబాద్ కు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ

Satyam NEWS

కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రి పని చెయ్యాలి

Satyam NEWS

Leave a Comment