34.2 C
Hyderabad
May 14, 2024 20: 23 PM
Slider హైదరాబాద్

బతుకమ్మ పండుగ వేడుకల్లో అంబర్ పేట్ ఎమ్మెల్యే

#amberpetmla

మహిళలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకునే బతుకమ్మ వేడుకలో పాలుపంచుకోవడం మా అక్క చెల్లెళ్లతో కలిసి బతుకమ్మ ఆడటం చాలా ఆనందంగా ఉంది అని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. అంబర్పేట డివిజన్ లోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ లో బతుకమ్మ వేడుకలను జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ విచ్చేసి బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకునే బతుకమ్మ వేడుకలో పాలుపంచుకోవడం మా అక్క చెల్లెళ్లతో కలిసి బతుకమ్మ ఆడటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వందలాది మందితో ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన బతుకమ్మ వేడుకలకి విచ్చేసిన అంబర్పేట్ డివిజన్ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు బేగం అమ్మ, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

గట్టు మట్టి తరలింపు పై తీగ పట్టుకుంటే డొంక కదిలింది..

Satyam NEWS

బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన కాయకల్ప బృందం

Satyam NEWS

డాక్టర్ పట్టా అందుకున్న రాజంపేట వాసి అనుపమ

Satyam NEWS

Leave a Comment