23.7 C
Hyderabad
May 8, 2024 04: 58 AM
Slider ప్రపంచం

అమెరికా అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉక్రెయిన్ ఎంపి

#innasovson

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తమ దేశాన్ని మోసం చేశాడని ఉక్రెయిన్‌ ఎంపి ఇన్నా సోవ్‌సన్‌ వ్యాఖ్యానించారు. తనను ప్రేరేపించే, తమ దేశ ప్రజలకు భరోసాను కల్పించే ఒక్కమాట కూడా బైడెన్‌ నుండి తాను వినలేదని ట్విట్టర్‌లో ఎద్దేవా చేశారు. అమెరికా చేస్తున్నదాని కన్నా పశ్చిమ దేశాలు మరింత సాయాన్నిచేస్తున్నట్లు ఉక్రేనియన్లు భావిస్తున్నారని ఆమె చెప్పారు.

ఈ యుద్ధంలో తమ దేశానికి అమెరికా ఎలాంటి సాయం చేయడం లేదని ఆమె చెప్పారు. అయితే ఈ ప్రసంగంలో బైడెన్‌ పోలాండ్‌కి మద్దతుగా మాట్లాడినందుకు తనకు చాలా సంతోషంగా ఉందంటూనే..అయినా దాడులు జరుగుతోంది కీవ్‌లోనూ, ఖార్కివ్‌లోనని, వార్సాలో కాదని అన్నారు. రష్యా దండయాత్ర పట్ల అమెరికా, బ్రిటన్  ప్రతిస్పందనల పట్ల  ఆమె తొలి నుండి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రష్యా వైమానిక దాడుల నుండి తమ దేశాన్ని రక్షించడానికి నో-ఫ్లై జోన్ గా ప్రకటించాలని సోవ్‌సన్‌ పునరుద్ఘాటిస్తూ 1994లో సంతకం చేసిన బుడాపెస్ట్ మెమోరాండం కారణంగా ఉక్రెయిన్ తమ అణ్వాయుధాలను విడిచిపెట్టడానికి అంగీకరించినందున ఉక్రెయిన్‌కు అలా చేయడానికి హక్కు ఉందని ఆమె స్పష్టం చేశారు. 

Related posts

సుదీర్ఘ పోరాటం అనంతరం ఆవిర్భవించిన రాష్ట్రం ఇది

Satyam NEWS

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ కు ఫిర్యాదు చేసిన బిజెపి నేతలు

Satyam NEWS

పోలీసు శాఖలో పదోన్నతులతో పాటు బాధ్యతలు పెరుగుతాయి

Satyam NEWS

Leave a Comment