31.7 C
Hyderabad
May 2, 2024 07: 14 AM
Slider మహబూబ్ నగర్

సుదీర్ఘ పోరాటం అనంతరం ఆవిర్భవించిన రాష్ట్రం ఇది

#Nagarkurnool SP

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఎస్ పి డాక్టర్ వై సాయి శేఖర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు‌, సిబ్బందికి, జిల్లా ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ అభివృద్ధి పథంలో ఉన్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో అమరుల త్యాగాల ఫలితం గా ఈ రాష్ట్రం ఏర్పడిందని ఆయన అన్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్నందున నాగర్ కర్నూల్  జిల్లాలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు.

నీతి నిజాయితీతో పారదర్శకతతో ధనిక పేద తేడా లేకుండా ప్రజలందరినీ సమానంగా చూడాలని పోలీసు అధికారులకు ఆయన పిలుపునిచ్చారు. దేశంలోనే అత్యున్నత ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న పోలీస్ వ్యవస్థగా తెలంగాణ పోలీసు శాఖ పేరు పొందిందని ఆయన తెలిపారు.

కరోనా వ్యాధి నివారణ గురించి అధికారులు సిబ్బంది అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, తప్పకుండా శానిటైజర్, మాస్కులు, గ్లౌజులు వేసుకోవాలని కోరారు. బయట తిరిగే సమయంలో భౌతిక దూరం పాటించాలని, విధులు నిర్వహించడం ఎంత ముఖ్యమో, కరోనా వ్యాధి బారిన పడకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం అంతే ముఖ్యమని జిల్లా ఎస్పి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పి అనోక్ జయకుమార్, ఏఆర్ డిఎస్పి దీపక్ చంద్ర,  ఏ ఓ  తాజుద్దిన్, ఎస్బిఐ ఇన్స్పెక్టర్ సంపత్, డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ రామ్ లాల్, ఆర్ఐ నారాయణ రాజు, ఆర్ఎస్ఐ తిరుపతి,  జిల్లా పోలీస్  కార్యాలయ సిబ్బంది, ఐ టి సిబ్బంది, డి సి ఆర్ బి సిబ్బంది,  ఏఆర్ హెడ్ క్వార్టర్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం నాగర్ కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ లో జరిగిన పతాకావిష్కరణలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ కుచకుళ్ళ దామోదర్ రెడ్డి తో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.

Related posts

తిరుమలలోకొనసాగుతున్న భక్తుల రద్దీ

Bhavani

వనపర్తిలో మెడికల్ షాపులో మంటలు

Satyam NEWS

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని దూషించిన బీజేపీ ఎంపి

Satyam NEWS

Leave a Comment